వెన్నెల కిషోర్ కి ఎవరు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున
అక్కినేని నాగార్జున వయస్సు మీద పడ్తున్న ఇంకా నవ మన్మధుడిలా ఉంటాడు. అభిమానులు కూడా అలానే పిలుస్తారు. పైగా నాగ్ నటించిన మన్మధుడు చిత్రం తర్వాత మన్మధుడుగానే అభిమానుల గుండెలో ఉన్నాడు. దాదాపు 17 ఏళ్ళక్రితం వచ్చిన మన్మధుడు మూవీ నాగ్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిల్చింది. మరపురాని చిత్రంగా మిగిలిన మన్మధుడు లో లవంగం పాత్రను బ్రహ్మానందం పోషించి నవ్వులు పూయించారు. ఇక మళ్ళీ ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తోంది. మన్మధుడు -2మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

మనం ఎంటర్ ప్రైజెస్ , ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న మన్మధుడు – 2 ని అక్కినేని నాగార్జున,పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం సందర్బంగా చిత్రం యూనిట్ తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్ ద్వారా నాగ్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ నటి లక్ష్మి,ఝాన్సీ,దేవదర్శిని తదితరులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత లక్ష్మి ఈ మూవీ ద్వారా తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతోంది.

మన్మదుడులో బ్రహ్మి పోషించిన పాత్రను మన్మధుడు – 2లో వెన్నెల కిషోర్ పోషించబోతున్నట్లు టాక్. ‘నీవు ఈ ప్రయాణంలో భాగం కావడానికి అంగీకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నీవలన ఈ సినిమా ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కొన్ని సరదా జ్ఞాపకాలను సృష్టించేందుకు సిద్దమవ్వు. స్వాగతం’అని రాసి ఉన్న లెటర్ ని చిత్ర యూనిట్ వెన్నెల కిషోర్ మేకప్ రూమ్ లో ఉంచారు. ఇది చదివిన వెన్నెల కిషోర్ వెంటనే నాగ్ కి కృతజ్ఞతలు తెలిపారు .

