మొగలి రేకులు ఇంద్రనీల్ ఎలాంటి వాడో తెలుసా ? నమ్మలేని నిజాలు
తెలుగు టివి షోస్ లో చేస్తూ,శాస్త్రీయ నృత్యాలు కూడా చేసిన నటుడు,యాంకర్ ఇంద్రనీల్ బాగా పాపులర్అయింది మాత్రం మొగలి రేకులు సీరియల్ ద్వారా అని చెప్పాలి. ఇతడి అసలు పేరు రాజేష్ బాబు. అయితే ఇంద్రనీల్ వర్మ అని ముద్దుగా పిలుస్తారు. చక్రవాకంలో మేఘన కొడుకుగా నటించాడు. అయితే జెమిని ఛానల్ లో ప్రసారమైన మొగలి రేకులు సీరియల్ తో పాపులర్ అయ్యాడు.
ఇక చక్రవాకం,అపరాజ్ఞి,సూర్యపుత్రుడు సీరియల్స్ లో కూడా నటించాడు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఇంద్రనీల్ ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఉంటాడు. విజయవాడ కెబిఎన్ కళాశాలలో స్టడీ పూర్తిచేసాడు. క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టపడే యితడు చదువుకునే రోజుల్లో క్లాసికల్ డాన్స్ నేర్చుకోలేక పోయాడు.
దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్ లో 2000 సంవత్సరంలో ఇంద్రనీల్ శిక్షణ పొందాడు. ఇక అలనాటి నటి మంజుభార్గవి కూచిపూడి డాన్స్ లో తన గురువుగా చెబుతాడు. మొగలిరేకులు లో ధర్మగా, కాలచక్రం సీరియల్ లో డిడిగా నటించాడు. మణికొండలో ఇంద్రనీల్ కూచిపూడి డాన్స్ అకాడమీ పెట్టి డాన్స్ పట్ల తన ఆసక్తిని కొనసాగిస్తున్నాడు.