Movies

సింగ‌ర్ మాళ‌వికకు ఎదురైనా చేదు అనుభవాలు తెలిస్తే షాక్ అవుతారు

అతి చిన్న వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీలో మంచి గాయ‌నిగా మంచి ఇమేజ్ సంపాదించిన మాళ‌విక‌ ఒక వేడుక‌లో బాల‌య్య‌తో క‌లిసి పాట పాడేసి అలరించింది కూడా. తాజాగా ఈమె అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వ‌చ్చింది. ఈమె త‌న‌కు ఎదురైన ఓ చేదు అనుభ‌వం గురించి బయటపెట్టింది. కొన్ని విశేషాలతో పాటు కొన్ని వివాదాల గురించి కూడా చెప్పుకొచ్చింది. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. ముఖ్యంగా అప్ప‌ట్లో తాను వరుస సినిమాల్లో పాడుతూ బిజీగా ఉండే, రోజుల్లో ఓ వ్య‌క్తి రోజూ ఫోన్ చేసి త‌న‌ను బాగా విసిగించేవాడ‌ని మాళ‌విక‌ వెల్లడించింది.

ఉదయం.. సాయంత్రం.. రాత్రి అనే తేడా లేకుండా మెస్సేజెస్ పెట్టి చంపేవాడ‌ని.. ఎవ‌రో తెలియ‌క పోవ‌డంతో ఇబ్బంది అయితే లేదు క‌దా అని అలా ఉరుకొన్నానని మాళవిక చెప్పింది. అయితే ఓ సారి తాను శివారెడ్డి, గీతామాధురి ప్రోగ్రామ్ కోసం వెళ్లిన‌పుడు చనిపోయిన కొంతమంది సెలబ్రిటీల జాబితాలో త‌న పేరు కూడా పెట్టి.. డెత్ డే అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడని గుర్తు చేసుకుంది.

దాంతో అప్పుడు త‌న‌తో ఉన్న శివారెడ్డి, గీతామాధురికి చెప్ప‌డంతో వెంట‌నే శివా రెడ్డి, ఆ ఫోన్ చేసిన వ్య‌క్తితో డిఎస్పీలా గొంతు మార్చి మాట్లాడి.. ఇంకోసారి మాళవికను ఇబ్బంది పెడితే పరిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చాడట. ఇక అక్కడినుంచి ఫోన్ లో వేధింపులు ఆగిపోయాయట. ఆలా త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని మాళవిక గుర్తుచేసుకుంది. అసలే ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చ‌ర్చ న‌డుస్తున్న నేపథ్యంలో మాళ‌విక చెప్పిన సంఘటన షాక్ కి గురిచేస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."