Movies

ముద్ద మందారం పార్వతి బ్యాక్ గ్రౌండ్ తెలుసా? ఆమె గురించి కొన్ని నమ్మలేని నిజాలు

జి తెలుగులో ప్రసారమయ్యే ముద్దమందారం సీరియల్ లో పార్వతి పేదింటి అమ్మాయిగా ఉంటూ, పెద్దింటి కోడలుగా అడుగుపెట్టి, ఆ ఇంట్లో ఎదుర్కొనే సమస్యలతో ఎలా నెట్టుకొస్తుందో చూపిస్తున్నారు. ఈ సీరియల్ లో పార్వతి గా నటిస్తున్న నటి పేరు తనూజ. బెంగుళూరు కి చెందిన ఈమె తెలుగులో ముద్దమందారంగా ఎంట్రీ ఇచ్చి తెలుగింటి సింగారంగా రాణిస్తోంది. పల్లెటూరి అమ్మాయిగా నటించాలని అనుకోవడం, అమ్మకు చెప్పడం జరిగింది. సరిగ్గా ముద్దమందారం అలానే ఉంది అని తనూజ అంటోంది. అసలు నేను ఇండస్ట్రీలోకి రావడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని,యాక్టింగ్ వద్దని అమ్మా,నాన్న అనేవారని,టీచర్ గానీ, లెక్చరర్ గానీ అవ్వడానికి ట్రై చేయమని అనేవారని చెప్పుకొచ్చింది.

మేము అమ్మానాన్నలకు ముగ్గురు సిస్టర్స్ . అక్క లాయర్, నేను యాక్టర్,చెల్లి పూజ ఇంజనీర్ అని చెప్పుకొచ్చింది. అబ్బాయిలకన్నా మీరు ఎందులో తక్కువ అని అమ్మ అన్నప్పుడు చాలా గర్వంగా ఉంటుందని చెప్పింది. ఇక స్టడీస్ చేస్తూ యాంకర్ గా చేయడంతో ఓ కన్నడ హర్రర్ మూవీలో ఛాన్స్ వచ్చిందని చెప్పింది. ఇక ఆమూవీ తెలుగులో చిత్రం కాదు నిజంగా పేరిట డబ్ అవ్వడంతో మంచి పేరు వచ్చిందని, అదే సమయంలో ముద్దమందారం సీరియల్ లో ఛాన్స్ వచ్చి, సెలెక్ట అయ్యానని తనూజ వివరించింది.

ఈ సీరియల్ హిట్ అవ్వడంతో అమ్మా నాన్న ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పింది. భయపడినట్లుగా ఇక్కడి వాతావరణం లేదని , పర్సనల్ ఫ్యామిలీ కన్నా సీరియల్ ఫ్యామిలీతో ఎటాచ్ మెంట్ పెరిగిందని పేర్కొంది. నా టాలెంట్ నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ, నటిస్తూంటే ఇప్పుడు మరో తమిళ ప్రాజెక్ట్ వచ్చిందని తనూజ చెప్పింది. ఉదయం 7గంటలకు షూటింగ్ కి వెళ్తే మళ్ళీ ఎప్పుడు ఇంటికి వస్తానో తెలీదు అంతలా వర్క్ షెడ్యూల్ ఉంటుందని,అందుకే మా ఫామిలీ మెంబర్స్ ఎవరూ షూటింగ్ కి రారని చెప్పుకొచ్చింది.

మా అమ్మ కొత్త కొత్త చీరలన్నీ దొంగతనంగా తెచ్చేస్తుంటానని నవ్వుతూ చెప్పింది. నిజానికి నాకు తెలుగు రాకపోవడం వలన ముద్దమందారం స్టోరీ సరిగ్గా అర్ధం కాలేదని,అఫర్ వచ్చిందని ఒప్పుకున్నానని చెప్పింది. అంతా కొత్తగా ఉన్నప్పటికీ మెల్లిగా ఒక్కొక్కటి తెలుసుకుంటూ, కథ అర్ధం చేసుకుంటూ క్యారెక్టర్ లో లీనం అయ్యానని తనూజ చెబుతోంది. ఆవిధంగా పార్వతిగా మారిపోవడం, తన నటన బాగుందని చాలామంది పొగడడం ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే ఇంకో సీరియల్ లో ఛాన్స్ వస్తే, పార్వతి మాదిరిగా తనను అభిమానులు ఆదరిస్తారా లేదా అనే భయం వెంటాడుతోందని తనూజ అంటోంది.

సీరియల్ లో నటించడం వలన బయట ప్రపంచాన్ని మిస్ అవుతున్నానన్న భావన లేదని, పేరెంట్స్ బెంగుళూరు నుంచి వచ్చి ఓ రోజు నాతో స్పెండ్ చేసి వెళ్తున్నారని చెప్పింది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న హరిత నన్ను ప్రేమగా చూసుకుంటూ, కాసేపు రెస్ట్ తీసుకో అని చెబుతూ వుంటారని వివరించింది. మంచి ఛాన్స్ లు వస్తున్నందున మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని తనూజ అంటోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."