Movies

హరిహరన్ టాప్ సింగర్ ఎందుకయ్యారో తెలుసా….ఎవరి ప్రభావం ఉందో తెలుసా?

సినీ నేపథ్య గాయకుడిగా పలుమార్లు జాతీయ పురస్కారాలు పొందిన టాప్ సింగర్ సంగీత స్వర చక్రవర్తి హరిహరన్ కి గజల్ గాయకుడిగా ఎంతో పేరుంది. ఈయన పేరు వినని సంగీత ప్రేమికులు బహుశా ఎవరూ ఉండరని చెప్పాలి. అంతటి మధురమైన గానంతో శ్రోతల మదిని దోచుకున్న గాయకుడు ఆయన. దాదాపు భారతీయ అన్నీ భాషలలో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరిహరన్, అతికొద్ది కాలంలోనే వేలాది పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మొదట్లో ఎన్నో టెలివిజన్ ప్రదర్శనలు ఇస్తూ ఎందరో అభిమానులను ఏర్పరచుకున్న ఈ గజల్ గాయకుడిని సినీ నేపధ్య గాయకుడిగా ఎ. ఆర్. రహ్మానే.1992 లో తమిళ చిత్రసీమ కి పరిచయం చేసారు.

మొదటగా రహ్మాన్ సంగీత సారథ్యంలో తమిళ ‘రోజా’ చిత్రంలో ఒక పాట పాడడంతో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.హరిహరన్ 1955 ఏప్రిల్‌ 3న కేరళ లోని తిరువనంతపురంలో జన్మించారు. ఈయన తండ్రి హెచ్‌.ఎ.ఎస్‌.మణి ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీతకారులు. సైన్స్, న్యాయశాస్త్రంలో డిగ్రీల్ని పూర్తి చేసిన హరిహరన్ చిన్న తనంలోనే కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతంలలో శిక్షణ పొందారు. మెహ్దీహసన్, జగ్జీత్‌ సింగ్‌ వంటి గాయకుల ప్రభావంతో గజల్‌ సంగీతం నేర్చుకుని ప్రతి రోజూ 13 గంటలకిపైగా సాధన చేసేవారట.

ఇక ఆ తరువాత లెస్లే లెవిస్‌తో కలిసి కొలోనియల్‌ కజిన్స్‌ పేరుతో బ్యాండ్‌ని ఏర్పాటు చేసిన హరిహరన్‌ పలు ఆల్బమ్‌లు రూపొందించారు.
ఇప్పటివరకు ఈయన 500కు పైగా తమిళ సినీ పాటలు, దాదాపు 1000 హిందీ పాటలు పాడారు. రెహ్మాన్ సంగీత సారథ్యంలో హరిహరన్ పాడిన పాటలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. 2004 లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారరంతో సత్కరించింది.

హరిహరన్ పాడిన పాటల్లో ‘ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు’, ‘కన్నుల్లో నీ రూపమే’, ‘వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా’, ‘యమహానగరి కలకత్తా పురి’, ‘నెల్లూరి నెరజాణా’, ‘పచ్చందనమే పచ్చదనమే’, ‘సూటిగా చూడకు’ పాటలు బాగా ఆకట్టుకున్నాయి.