Movies

మార్చిలో 22 సినిమాలు విడుదల అయితే ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా?

వేసవి వస్తోందంటే చాలు కొత్త సినిమాలు సందడి మొదలవుతుంది. ఇక మార్చి నెల‌లో బాక్సాఫీసు వ‌ద్ద సినిమాల సంద‌డి భారీగా క‌నిపించినా, థియేట‌ర్ల‌లో చూసే జ‌నాలే క‌రువ‌య్యారు. ఏకంగా 22 సినిమాలు రిలీజ్ అయితే ఏ సినిమా కూడా కలెక్షన్స్ కురిపించలేకపోయింది. కేవలం ఒకే ఒక్క సినిమా డబ్బులు తెచ్చిపెట్టింది. దాదాపు అన్ని సినిమాలు రెండో రోజు నుంచే ప్రేక్షకులు లేక వెల‌వెల‌బోయాయి. శుక్ర‌వారం విడుద‌లైన‌ సినిమాలు, శ‌నివారం క‌నిపించ‌కుండా పోయాయి. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఆడియోన్స్‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పించ‌లేక‌పోయాయి. అదే విధంగా ఎగ్జామ్ ఫీవ‌ర్ కూడా టాలీవుడ్‌కు గ‌ట్టిగానే తాకింది.

మార్చి నెల మొద‌టి వారంలో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. క‌ళ్యాణ్ రామ్ 118, అజిత్ ‘విశ్వాసం’, మ‌రో చిన్న హీరో విశ్వ‌నాథ్ ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ బాక్సాఫీసు వ‌ద్ద సంద‌డి చేశాయి. కెమెరామెన్ కేవీ గుహ‌న్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌క్కెక్కించిన‌ 118 కాస్తా ఆడియోన్స్‌ను అల‌రించింది. కాకపోతే వస్సూళ్ళు ఓ మోస్తరుగానే వచ్చాయి. విశ్వాసం, క్రేజీ క్రేజీ ఫీలింగ్ మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. ఇక రెండో వారంలో కూడా ముడు సినిమాలు బాక్సాఫీసు వ‌ద్ద త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాయి.

సర్వం తాళమయం, బొట్టు, లవ్ గేమ్ మూడు చిత్రాలు కూడా బోల్తాకొట్టాయి. అలాగే మూడో వారం కూడా స్క్రీన్ల‌పై సినిమాల హడావుడే త‌ప్ప, థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల కోలాహ‌లం క‌నిపించ‌లేదు. ఈ సారి నాలుగు సినిమాలు విడుద‌లైనా.. ఒక్క కూడా చెప్పుకొద‌గ్గ‌ది లేదు. జెస్సీ, బిలాల్‌పూర్ పోలీస్ స్టేష‌న్‌, ప్రాణం ఖ‌రీదు, వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి రిలీజ్ అయ్యాయి. వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి రాయ్ ల‌క్ష్మీ న‌టించ‌డంతో తొలి రోజు క‌లెక్ష‌న్లు బాగానే ఉన్నా.. రెండో ఖాళీ కూర్చీలే క‌నిపించాయి. జెస్సీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, నిలబడలేదు.

యూత్ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూసిన మూవీ చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు మార్చి 21న రిలీజ్ అయింది. ఈ సినిమాతో పాటు విశాల్ పులిజూదం, విన‌రా సోద‌ర వీర‌కుమార కూడా బాక్సాఫీసు వ‌ద్ద సంద‌డి చేశాయి. చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు ట్రైల‌ర్ చూసిన యూత్‌.. తొలి రోజు టికెట్ల కోసం ఎగ‌బ‌డ్డారు.ఇక రెండో రోజు నుంచి థియేట‌ర్లు వెలవెలబోయాయి. విశాల్ పులిజూదం కూడా ఫ్లాప‌యింది. ఇక లాస్ట్ వీక్‌లో మ‌రో నాలుగు సినిమాలు వచ్చాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో హైప్ క్రియేట్ చేసి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, మెగాప్రిన్సెస్ నిహారిక న‌టించిన సూర్యకాంతం, న‌య‌న‌తార న‌టించిన ఐరా, ప్రేమ అంత ఈజీ కాదు, సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వీటిలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మాత్ర‌మే పాజిటివ్ టాక్‌తో ఆడుతోంది. ఈ మూవీ తెలంగాణ‌లో మాత్ర‌మే రిలీజ్ అయింది. ఏపీలో కూడా విడుద‌లయితే క‌లెక్ష‌న్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. అలాగే చిన్న చిత‌క చిత్రాలు కూడా రిలీజ్ అయినా ఏదీ ఆడలేదు.