Movies

సౌందర్య రిజెక్ట్ చేసిన ఆ హీరో ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ నటుడు… ఎవరో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ఏస్థాయికి చేరతారో,ఎప్పుడు కిందికి పడిపోతారో తెలీదు. కానీ నటీనటులందరూ కూడా ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇందులో కొందరు భౌతికంగా ఉన్నా లేకున్నా సినిమాల్లో సజీవంగా ఉంటారు. నందమూరి, అక్కినేని,ఎస్వీఆర్, రేలంగి,జగ్గయ్య, సూర్యకాంతం,రావు గోపాలరావు, శోభన్ బాబు, రాజబాబు,అల్లు రామలింగయ్య ఇలా ఎందరో చిరస్మరణీయులుగా ఉన్నారు. ఇలాంటివాళ్లలోనే అలనాటి అందాల నటి సౌందర్య కూడా ఒకరు. పేరుకి కన్నడ భామ అయినప్పటికీ అందం,అభినయంతో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపేసింది. తెలుగు,మళయాళ ,తమిళ,కన్నడ, హిందీ భాషల్లో తన సత్తా చాటింది. అప్పట్లో ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన సినిమాల్లో సౌందర్య హీరోయిన్ గా రాణించింది. పైగా ఆవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అయ్యాయి.

సౌందర్య నటనను ఎంతగానో మెచ్చుకునే కృష్ణారెడ్డికి సౌందర్య అంటే చెప్పలేని అభిమానం కూడా ఉండేది. ఈయన దర్శకత్వం వహించిన రాజేంద్రుడు గజేంద్రుడు,నెంబర్ వన్,మాయలోడు,వంటి సినిమాల్లో సౌందర్య నటన అద్వితీయం అని చెప్పాలి. కెరీర్ లో సౌందర్య దూసుకెళుతున్న రోజుల్లో ఓ హీరో సరసన నటించడానికి సౌందర్య రిజెక్ట్ చేసిందట. అంతేకాదు అతడే హీరో అయితే తాను ఆ సినిమాలో నటించనని కూడా చెప్పేసిందట. అయితే ఏదీ మనచేతుల్లో ఉండదని అంటారు కదా. అలాగే సౌందర్య నటించడానికి తిరస్కరించిన ఆ హీరో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసాడు.చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి,హీరోగా, స్టార్ కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో తన నటనతో జనానికి దగ్గరయ్యాడు. ఇప్పటికే అతడెవరో అర్ధం అయిపోయి ఉంటుంది. అతడే అలీ. అవును అలీ హీరోగా కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యమలీల మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెల్సిందే.

అలీ కెరీర్ ని మలుపు తిప్పిన ఈ మూవీ కమర్షియల్ హిట్ కొట్టింది. అయితే ఆ మూవీలో సౌందర్యను హీరోయిన్ గా అడిగితె ససేమిరా అందట. కథ అంతావిని సినిమాకు ఒకే చెప్పిన తర్వాత హీరో ఎవరో తెలుసుకుని అయితే చేయనని తేల్చి చెప్పేసిందట. అంతేకాదు ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళు కూడా అలీతో ఏంటి వద్దని కృష్ణారెడ్డికి చెప్పారట. అయితే ఈ కథకి అలీ మాత్రమే సరిపోతాడని చెప్పి సినిమా తీసాడు కృష్ణారెడ్డి. పైగా అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన ఇంద్రజ కు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు డైరెక్టర్. ఆవిధంగా సౌందర్య ఓ హిట్ మిస్సయితే, ఇంద్రజకు ఓ బ్లాక్ బస్టర్ హిట్ చేతికి దక్కినట్లయింది.