Movies

భారతీయ సినిమాల్లో గాన కోకిల ఎస్ జానకి గురించి కొన్ని నమ్మలేని నిజాలు

తారలు ఎందరు మారుతున్నా ఆమె గొంతులో ఏ మాత్రం మార్పు రాలేదు. సాధారణంగా అప్పటి గాయనీమణుల స్వరాలని ఆస్వాదించే అవకాశం తరువాతి తరాలకు అందుబాటులో ఉండదు. కేవలం పాత పాటలలోనే విని ఆనందించాల్సి ఉంటుంది. మరి ఆమె విషయంలో ఇది వర్తించదు. అంజలీ దేవి దగ్గరి నుంచి మనీషా కొయిరాలా వరకు ప్లే బ్లాక్ సింగర్ గా ఆమె మంచి మార్కులే కొట్టేశారు.ఆమె స్వరానికి ఎప్పటికీ పదహారేళ్లే అని చెప్పాలి. ఆమె ఎస్ జానకి. “పదహారేళ్ళ వయస్సు” చిత్రంలోని “సిరిమల్లె పువ్వా…సిరిమల్లె పువ్వా” అనే పాటలో ఎంతటి మాధుర్యం ఉందో అదే మాధుర్యం “ఒకేఒక్కడు” మూవీలో రెహమాన్ కంపోజిషన్ లో వచ్చిన “మగధీర” సాంగ్ లో కూడా కనిపిస్తుంది.

ఇక మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా జానకి గాత్రంలో గల మ్యాజిక్ గమనించి జానకితో పాటు దాదాపు 200 డ్యూయెట్స్ కి గాత్రాన్ని అందించేలా చేసారు. అలాగే, జానకి ఎక్కువ డ్యూయెట్స్ ఎస్పీ బాలసుబ్రమణ్యంతో ఆలపించారు.జానకి కన్నడలో ఎక్కువ పాటలు పాడారు. బాలసుబ్రహ్మణ్యంతో జానకి స్వరం జత కలిస్తే ఆ పాటలు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకునేవి.”అంతఃపురం” లోని “సూరీడు పువ్వా…జాబిల్లి నువ్వా చిన్నబోయినావెందుకే” అనే పాట ఎంతో భావోద్వేగంతో ఉంటుంది . ఈ పాటకి జానకి అందించిన స్వరం సినిమాలోని సందర్భాన్ని చక్కగా అమరేలా చేసింది. పాత్రకు తగిన మాడ్యులేషన్ ను అందించగలిగిన సామర్థ్యం జానకి సొంతం.

ఇందుకోసం అనేక అవార్డ్స్ ను కూడా అందుకున్నారు. ” సప్తపది” చిత్రంలో “గోవుల్లు తెల్లన” అనే పాట జానకి చిన్నపిల్లవాడు గొంతులో ఆలపించి, అనేక ప్రశంసలను అందుకున్నారు. ఇదే విధంగా చిన్న పిల్లల గొంతులో కన్నడంలో అనేక పాటలను పాడారు. అన్ని భాషలలో దాదాపు 100 పాటలు ఇటువంటివే. జానకి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ అలాగే మలయాళ చిత్రాలలో అనేక పాటలు పాడారు. ఎక్కువ పాటలు కన్నడంలో పాడారు.”పద్మభూషణ్”అవార్డు తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని దక్షిణాదికి చెందిన కళాకారులను గుర్తించే విషయంలో కాస్త నిర్లక్ష్యం కనిపించిందని భావించిన జానకి 2013లో పద్మభూషణ్ వస్తే తిరస్కరించారు.

కాగా కన్నడలో “హంసలేఖ” అనే మ్యూజిక్ డైరెక్టర్ జానకి స్వరాలలోనున్న మాధుర్యాన్ని అలాగే మ్యాజిక్ ను గమనించే తన ప్రతి సినిమాలో జానకికి పాటలు పాడే ఛాన్స్ ఇచ్చారు. ఒరియా, సింహళీస్, కొంకణి, తులు వంటి భాషలలో కూడా జానకి పాటలు పాడి,ఆయా భాషలకు చెందిన వారి అభిమానాన్ని దండిగా పొందారు. ఇక గుంటూరు పట్టణంలో రేపల్లె తాలూకా పాలపట్లలో 1938లో ఏప్రిల్ 23న పుట్టిన జానకి తమిళ చిత్రంతో తన కెరియర్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూడకుండా, ఆరు దశాబ్దాల పాటు ఆమె ప్లే బ్యాక్ సింగర్ గా విజయవంతంగా కొనసాగారు. అరవై ఏళ్ళ పాటల ప్రస్థానానికి ఆమె 2017లో అక్టోబర్ 28న రిటైర్మెంట్ తీసుకుంటూ, మైసూర్ లో ఒక కాన్సెర్ట్ కూడా నిర్వహించారు.