Movies

బాలయ్యకు ఈ వయస్సులో మెగాస్టార్ తో పోటీయా ?

ఒకప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలయ్య పోటాపోటీగా నటించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి బాడీపై దృష్టి పెట్టని కారణంగా పెద్ద ఎత్తున బరువు పెరిగాడు. దాంతో చిరంజీవి రీ ఎంట్రీ సమయంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రీ ఎంట్రీకి ముందు దాదాపుగా పది కేజీల బరువు తగ్గాడని ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఖైదీ నెం.150 చిత్రంలో నటించడానికి ముందు చాలా బరువు తగ్గాడు. ఇక ప్రస్తుతం నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం కోసం మరో అయిదు కిలోల బరువు చిరంజీవి తగ్గాడు.త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చిరంజీవి చేయబోతున్నాడు. ఆ సినిమాకు కూడా మరింత బరువు తగ్గాలని దర్శకుడు సూచించాడట.

ఇలా చిరంజీవి గతంతో పోల్చితే చాలా బరువు తగ్గి నాజూకుగా కనిపిస్తున్నాడు. అయితే బాలకృష్ణ బరువు చాలా పెరిగాడు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ చిత్రంలో తన తండ్రిలా కనిపించేందుకు బాలయ్య లావు అయ్యాడు. మామూలుగానే లావు ఉండే బాలయ్య మరింత లావు అవ్వడంతో అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య కూడా తన బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడనే టాక్‌ వస్తోంది. బాలకృష్ణ తన తర్వాత సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయబోతున్నాడు. బోయపాటి చాలా నెలల క్రితమే బాలయ్య కోసం స్క్రిప్ట్‌ రెడీ అంటూ ప్రకటించాడు.

అయితే ఈ సినిమా ప్రారంభంకు మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇంత సమయం ఎందుకా అని అంతా ఆశ్చర్య పోయారు. దానికి కారణమ్  బోయపాటి సినిమాలో చాలా సన్నగా కనిపించాలనే ఉద్దేశ్యంతో బరువు తగ్గేందుకు సిద్దం అయ్యాడు. ఇంకా చెప్పాలంటే, బాలయ్య ఎప్పుడైతే 15 కేజీల బరువు తగ్గుతాడో అప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేస్తారట. మరి 15 కేజీల బరువు తగ్గడం అంటే బాలయ్యకు సాధ్యం అయ్యే పనేనా అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."