Health

సమ్మర్‌లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లు ఇవే.

ఎండాకాలం రాగానే చాలామంది త్వరగా అలసిపోతారు. శరీరంలోని నీటిశాతం తగ్గిపోతుంది. కాబట్టి ఆ సమస్యను తీర్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారమేంటో ఇప్పుడుచూద్దాం..

ఈ సీజన్‌లో ముంజలు ఎక్కువగా వస్తాయి. సిటీల్లోనూ అక్కడక్కడ ముంజలు అమ్మడం కనిపిస్తూనే ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అంతేకాదు.. ఒంటికి కావాల్సిన నీటిశాతాన్ని ఈ ముంజలు అందిస్తాయి. వీటిలోని పీచుపదార్థాలు మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. కాల్షియం, ఇనుము, జింక్, కాపర్, మెగ్నీషియం, సెలీనియంలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తుంది

కీరదోస : నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోసలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని అలానే గానీ, సలాడ్, పెరుగు, మజ్జిగలో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.

ద్రాక్ష : ఎండాకాలంలో శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది. వాటిని తిరిగి పొందాలంటే ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు గల ద్రాక్షలను తీసుకోవడం మంచిది. వీటిని తీసుకోవడం వల్లో అలర్జీ, ఇన్ఫెక్షన్లుకూడా దరిచేరవు.

పుచ్చకాయ : దాదాపు 80శాతం నీరు ఉండే పుచ్చకాయలు ఆరోగ్యానికి చాలామంచిది. వీటిని తినడం వల్ల ఇందులోని విటమిన్ ఎ ఆరోగ్యానికి మేలు చేయడమే కాక.. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల ఎఫెక్ట్ అంతగా పడవు.

పచ్చిమామిడి : ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే మామిడికాయలు తినడం వల్ల వేసవి తాపం తగ్గడమే కాక వడదెబ్బకి చక్కని పరిష్కారం. మామిడి ముక్కలను నీటిలో కలిపి అందులోచక్కెర వేసి బాగా కలపాలి. వాటిని తాగడం వల్ల వడదెబ్బ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఈ ముక్కలను ఉప్పు చల్లి తినడం వల్ల దాహార్తి తగ్గుతుంది.