మెగా హీరో మెల్లగా దారిలో పడుతున్నాడా?
మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఇస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక మెగా కుటుంబం నుంచి హీరోగా తెరంగేట్రం చేసిన అల్లు శిరీష్ కెరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ దక్కించుకున్న దాఖలాలు లేవు. పైగా సినిమాల సంఖ్య చాలా తక్కువ చేశాడు. సినిమ సినిమాకు సంవత్సరం కంటే ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
భారీ అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం మెగా బ్రాండ్ ఉన్నా కూడా పెద్దగా జనాల దృష్టిని ఆకర్షించడం లేదు. అయితే ఈ సినిమా బయ్యర్ల దృష్టిని మాత్రం బాగానే ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రం టీజర్, ట్రైలర్ వారిని మెప్పించాయట. పైగా ఇక ఈ చిత్రంలో బాలనటుడిగా అందరికి సుపరిచితుడు అయిన భరత్ కీలక పాత్రలో నటించడంతో అతడి కోసం ఈ చిత్రంను చూడాలని ఫాన్స్ ఆశ పడుతున్నారని టాక్. ఇక ఈ మూవీ అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం 10 కోట్ల బిజినెస్ చేసిందట.
దాంతో పాటు శాటిలైట్ రైట్స్ , ఇతర రైట్స్ ద్వారా 15 కోట్ల వరకు రాబట్టిందట. దాంతో ఈ చిత్రం 15 కోట్ల బిజినెస్ చేసిందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంత బిజినెస్ చేయడంతో నిర్మాతలు టేబుల్ ఫ్రాపిట్‌ను దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఈ మూవీ కోసం నిర్మాతలు 14 కోట్ల బడ్జెట్‌ను పెట్టారని, దాంతో సినిమా 15 కోట్ల బిజినెస్‌ను చేయడం వల్ల నిర్మాతలు ముందే ఒక కోటి లాభం దక్కించుకున్నారు. అల్లు శిరీష్ మూవీ ఈ పరిస్థితుల్లో ఇంత బిజినెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ చిత్రం సక్సెస్ అయితే మరింత లాభాలు నిర్మాతలకు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి.