Movies

కోయిలమ్మ సీరియల్ కోకిల బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

తెలుగు టివి రంగంలో సీరియల్స్ కి గల ప్రాధాన్యత చెప్పలేనిది. అందులో నటించేవాళ్లకు మంచి పాపులారిటీ తక్కువ సమయంలోనే వస్తోంది. తెలుగులో టాప్ టు సీరియల్ గా దూసుకుపోతున్న కోయిలమ్మ సీరియల్ లో అమర్ భార్యగా, అశోక్ – లక్ష్మిలకు కూతురుగా కనిపంచే కోకిల కి మంచి పేరే వచ్చింది. నవంబర్ 22న జన్మించిన కోకిల అసలు పేరు తేజస్విని గౌడ. ఈమె పేరెంట్స్ మల్లికార్జున్,భ్రమరాంబ. వీళ్లకు కోకిల ఒక్కర్తే కూతురు. ఈమెది కన్నడ భాష. కర్ణాటకలో ఫిరా అనే గ్రామంలో పుట్టింది. కోకిల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బిటెక్ పూర్తిచేసింది. 5. 62 అడుగుల హైట్ ఉండే కోకిలకు గల లాంగ్ హెయిర్ ని షార్ట్ చేసే ఉద్దేశ్యం ఎప్పటికీ లేదట.

రెబల్ స్టార్ వారసుడు ప్రభాస్ తో కల్సి నటించే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తానని అంటోంది. కెజిఎఫ్ లో హీరోగా నటించిన యష్ ని ఎక్కువగా లైక్ చేస్తుంది. కోకిలమ్మ సీరియల్ లో పాడిన పాటలు తన రియల్ వాయిస్ తో పాడినవే. సీరియల్ లో కోకిల నటన చూస్తే ఈమెకు ఇంతటి ఓర్పు ఎలా వచ్చిందని అనిపిస్తుంది. ఈమె ఫేవరేట్ చాకోలెట్ సిల్క్ చాకొలేట్. కోకిల చూద్దామని ఓ మోడల్ లాగా ఉంటుంది. మౌనరాగం సీరియల్ అమ్ములు,కోకిల మంచి ఫ్రెండ్స్. కార్తీక దీపం సీరియల్ లో హీరోయిన్ అంటే కోకిలకు చాలా ఇష్టమట. ఇక సినీ హీరోయిన్స్ లో అనుష్క అంటే చాలా ఇష్టమట. అభిమాన హీరో అక్కినేని నాగార్జున అట. కోయిలమ్మ సీరియల్ లో కోకిలను ప్రేమించిన సమీర్ ఆమెపై ప్రస్తుతం చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే నిజానికి సమీర్ ని కోకిల ఇష్టపడలేదు.