Movies

అమ్మో అక్షయ్.. యాడ్స్‌తోనే ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో?

స్టూడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి, సినిమా అవకాశాలు దక్కించుకుంటారు చాలామంది. అలా ఒక్క సినిమా హిట్టైతే చాలు సెలబ్రిటీలు అయిపోతుంటారు. కొంచెం పాపులారిటీ సంపాధించుకుని పారితోషికాలు నిర్ణయిస్తుంటారు. ఒక్క సినిమాలే కాదు, టీవీ కమర్షియల్స్, వివిధ బ్రాండ్లకు ప్రచార కర్తలుగా కూడా వ్యవహరిస్తుంటారు. అలా ఉంటూ ఇప్పుడు ఒక్కొక్కరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

యాడ్ ఫిలింస్, కమర్షియల్స్‌ చేస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నgబర్ స్థానంలో ఉన్నారు. ఇప్పుడాయన చేతిలో రూ. 100 కోట్ల విలువ చేసే కమర్షియల్స్ ఒప్పందాలున్నాయి. అక్షయ్ తర్వాత రెండో రణ్‌వీర్ సింగ్ రూ.84 కోట్లు రెండో స్థానంలో ఉండగా.. ఆయన స్థానంలో ఆయన సతీమణి దీపికా పదుకొణె రూ.75 కోట్లు తీసుకుంటూ మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అమితాబ్ బచ్చన్‌ (రూ.72 కోట్లు), ఆలియా భట్‌ (రూ.68 కోట్లు), షారుఖ్‌ ఖాన్‌ (రూ.56 కోట్లు), వరుణ్‌ ధావన్‌ (రూ.48 కోట్లు), సల్మాన్‌ ఖాన్‌ (రూ. 40 కోట్లు), కరీనా కపూర్‌ (రూ.32 కోట్లు), కత్రినా కైఫ్‌ (రూ.30 కోట్లు) ఉన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."