Movies

అలనాటి నటి ఛాయాదేవి చివరి రోజుల్లో ఎన్ని కష్టాలు పడిందో పాపం

సినిమాల్లో సూర్యకాంతం, ఛాయాదేవి అంటే తెలియని వారుండరు. గయ్యాళి పాత్రలకు వాళ్ళు పెట్టింది పేరు. ఇందులో ఛాయాదేవి స్థాయికి తగ్గ క్యారెక్టర్  ఆర్టిస్టు పాత్రలను ఎంచుకుని తన నటనతో మెప్పించింది. కోడలిని బాధలు పెట్టె పాత్రలో,అత్యాశకు పోయి భంగపడే పాత్రలలో ఆమె ఒదిగిపోయింది. అత్తా, సవతి తల్లి పాత్రల్లో ఆమె నటన అమోఘం. అయితే సినిమాల్లో పాత్రలు ఎలా వున్నా నిజ జీవితంలో ఆమెది వెన్నెలంటి మనసు అని చాలా దగ్గర నుంచి చూసిన వారంతా చెబుతారు. అలాగే ఆమెతో కల్సి సినీ ప్రయాణం చేసిన వాళ్ళు కూడా ఆమె మంచితనం గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 

ఆమె పోషించే పాత్రకు,సెట్లో తీరిక సమయంలో ఆమె తీరు చూసిన వాళ్ళు నోరెళ్లబెట్టేవారట. అందరితో సరదాగా కబుర్లు చెబుతూ అందరితో కల్సిపోయేవారట. ఆకలి అని ఎవరైనా అంటే కడుపు నిండా భోజనం పెట్టె మంచి మనసున్న వ్యకి ఆమె అని అంటారు. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళమని చెప్పడమే కాదు. ఆకలి అని ఎవరైనా అంటే ఇంట్లో ఏది ఉంటె అది పెట్టేవారట. సినిమాల్లో వచ్చిన డబ్బుతో మద్రాసులో ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఎవరైనా కష్టంలో ఉంటె డబ్బించి ఆదుకునే గొప్ప మనిషిగా గుర్తింపు పొందింది. ఓ విధంగా ఈ మంచి తనమే చివరి రోజుల్లో ఆమె కు శాపంగా మారిందని అంటారు. 

చాలామంది నిర్మాతలు ఆమె దగ్గర ఫైనాన్స్ పేరిట డబ్బులు తీసుకుని తర్వాత ముఖం చాటేశారట. తరువాత ఇస్తామని తీసుకుని ఎగ్గొట్టినవాళ్ళే ఎక్కువమంది ఉన్నారట. ఇక ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. సుబ్బారావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని కొందరు అనేవారు. అయితే ఆయన ఆమెకు పెద్దదిక్కుగా ఉంటూ  ఛాయాదేవి బాగోగులు చూసుకునేవారని, నిజానికి భర్త కాదని కొందరు అంటారు. ఇక ఆమెకు పిల్లలు కూడా లేరు. ఎవరినో పెంచుకుని పెళ్లి చేసి పంపించేసారట.

సుబ్బారావు మరణం తర్వాత ఆమె ఒంటరిగానే ఉండేవారు. తెలిసి కొంత తెలియక కొంత ఆమె షుగర్ వ్యాధిని లెక్కచేయలేదు. దాంతో కాలివేళ్ళను,ఆతర్వాత ఇన్ఫెక్షన్ పెరడంతో కాలిని కూడా తొలగించారు. మంచానికి పరిమితం కావడం, మరికొన్ని ఆరోగ్య సమస్యలు చుట్టముట్టడం,ఈలోగా ఆమె కొన్న ఇల్లు తనదేనని ఓ వ్యక్తి కోర్టుకి వెళ్లడం వంటి కారణాలతో ఆమె ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరి  క్షణాల్లో తనను పలకరించే వాళ్ళు కూడా లేక కన్నుమూశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."