మహేశ్వరిపై షాకింగ్ కామెంట్స్ చేసిన J.D.చక్రవర్తి
ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తీకేయ నటించిన ‘హిప్పీ’ మూవీ ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన తన పర్సనల్ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ,‘నేను కాని మా గురువు రామ్ గోపాల్ వర్మ కాని, ప్రశ్నని బట్టే సమాధానం ఇస్తాం. అంతే తప్ప ప్రొజెక్ట్ చేసుకోవడానికి కామెంట్స్ చేయం’ అని చెప్పుకొచ్చాడు. ‘యాంకర్లు అడిగే విపరీత ప్రశ్నల్ని బట్టే విపరీత ఆన్సర్ ఉంటాయి. కాని వీటిలో కొన్నే హైలైట్ అవుతాయి. ఎందుకో తెలుసా? అవి మాకు నచ్చికాదు.
మీకు (మీడియా) నచ్చి. మీకు వినాలనిపించి. చెప్పాలనుకునేవి. చెప్పలేనివి. మీరు మాట్లాడలేనివి కూడా మేం మాట్లాడేస్తుంటాం. అందుకే టార్గెట్ అవుతుంటాం. అంతేతప్ప హైలైట్ కావాలని ఎలా మాట్లాడతాం’అని జెడి చెప్పాడు. ‘పిచ్చి పిచ్చివి మాట్లాడుతుంటే జనానికి నచ్చవు. కాంట్రివర్శి మేం చేయం. మీడియా క్రియేట్ చేస్తుంది. మేం మాట్లాడిన దాంట్లో ఏది వివాదం అవుతుందో దాన్నే మీడియా హైలైట్ చేస్తుంది. వివాదం సృష్టించేది మీడియా’అని అన్నాడు.
‘అంతెందుకు తల్లిని మించిన దైవం లేదని నేను చెప్పినప్పుడు ఎవరూ దాన్ని హైలెట్ చేయలేదు. నా తల్లే నా గైడింగ్ ఫ్యాక్టర్ అని లక్షసార్లు చెప్పా.. ఆ న్యూస్ రాయరు. కాని.. ఎప్పుడో చిన్నప్పుడు ఉందో లేదో తెలియని మహేశ్వరితో ఎఫైర్ తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. నా తల్లి మూడు ఎంఏలు చదివి, రెండు పీహెచ్‌డీలు చేసి పెద్ద ప్రొఫెసర్ అని చెప్పా అది వేయలేదు. అయితే ఈ విషయంలో మీడియాది తప్పు అని అనడం లేదు. ఎక్కడ గిల్లితే హైలైట్ అవుతుందో మీకు బాగా తెలుసు. మీరు బాగా గిల్లుతారు అని అంటున్నా. మాకు కావాల్సింది కూడా అదే’అంటూ నవ్వేసాడు జెడి.
‘మహేశ్వరితో ఎఫైర్ గురించి ఇప్పటికీ నన్ను అడుగున్నారు.
ఎక్కడుందో లేదో తెలియని మహేశ్వరి గురించి పదే పదే అడుగుతున్నారు. అయితే దీనిపై మాట్లాడటానికి నాకు అభ్యంతరం లేదు. మహేశ్వరితో ఎఫైర్ వార్తల్లో వాస్తవం లేదు. అవి ఎందుకు వచ్చాయి అంటే, మేం ఇద్దరం కలిసి నటించిన ‘గులాబి’ సినిమాకి జనం బాగా కనెక్ట్ అయ్యారు. తెరపై మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకున్నారు. మేం ఇద్దరం మంచి స్నేహితులమే తప్ప ఎఫైర్ లాంటివి ఏం లేదు. ఒకవేళ మహేశ్వరితో ఎఫైర్ ఉండిఉంటే ఆమెను వదిలేసేటంత చేతకాని వాడ్ని కాదు. ఆమె మంచి ఫ్రెండ్ మాత్రమే. ఆమె పర్శనల్ విషయాలను కూడా నాతో షేర్ చేసుకునేది. ఇదంతా పచ్చి నిజం’అని జెడి స్పష్టం చేసాడు.

