Movies

చంటి సినిమా లోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపట్టారా ఇతను ఇప్పడు టాలీవుడ్ హీరో అని మీకు తెలుసా?

పండగొచ్చిందంటే సినిమాలు విడుదలవ్వడం పరిపాటి. స్టార్ హీరోల సినిమాలు పండగలను టార్గెట్ చేసుకుని విడుదలై బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. ఎప్పటినుంచో ఈ ఆనవాయితీ వుంది. అందుకే 1992సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ నటించిన ‘చంటి’సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మీనాతో కల్సి నటించిన వెంకీ ఈ సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. క్రేజీ హీరోగా ఉంటూనే నటనలో వైవిద్యం గల సినిమాల్లో నటిస్తూ చంటిలాంటి వినూత్న సినిమా చేసి తన సత్తా చాటాడు. 
ఇక ఈ సినిమాలో వెంకీతో పాటు మీనా, నాజర్,మంజుల, సుజాత,బ్రహ్మానందం,ఇలా అన్ని క్యారెక్టర్ లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు.

ఇళయరాజా సంగీతం ఆడియన్స్ ని ఓలలాడించింది. ఇక ఈ సినిమాలో మరో క్యారెక్టర్ కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. అదేనండి చంటి పాత్రధారి వెంకీ చిన్నప్పుడు క్యారెక్టర్  వేసిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో అబ్బురపరిచాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ,తర్వాత కాలంలో హీరోగా ఎదిగాడు. చిన్నప్పటి వెంకీలా తన నటనతో మైమరపించిన అతడి పేరు అజయ్ రాఘవేంద్ర. చంటి సినిమాతో తెరంగేట్రం చేసిన అజయ్ తొలిసినిమాతోనే మంచి గుర్తింపు కొట్టేసాడు. అయితే ఆతర్వాత సినిమాల్లో కనిపించలేదు.

పెరిగి పెద్దవాడైన తర్వాత ‘నా బాపు బొమ్మకి పెళ్ళంట’ మూవీతో హీరోగా నటించి మెప్పించాడు. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో వచ్చిన మళ్ళీ ఈ మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్టుగా సినీ రంగంలో అడుగుపెట్టి, పెరిగి పెద్దయ్యాక హీరో హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళు,అందులో రాణించినవాళ్లు,వెనక్కి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అజయ్ రాఘవేంద్ర కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత మళ్ళీ కనిపించలేదు. ఎందుకు హీరోగా తన ప్రస్తానం సాగించలేకపోయాడో అర్ధం కానీ ప్రశ్న గా మిగిలిపోయింది.