DevotionalUncategorized

ఈ రోజు సూర్య గ్రహణం…ఇండియాలో కనిపిస్తుందా….గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా….???

జులై 2 రేపు సంపూర్ణ సూర్య గ్రహణం. సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుంది. సూర్య గ్రహణం మన ఇండియాలో కనపడుతుందా? నియమాలు పాటించాలా? గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. సూర్య గ్రహణం అనేది అమావాస్య రోజు వస్తుంది. అయితే ప్రతి నెలలో వచ్చే ప్రతి అమావాస్య రోజు సూర్య గ్రహణం రాదు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉండి చంద్రుడు రాహువు లేదా కేతువు స్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా సూర్య గ్రహణ సమయం సుమారు 8 నిమిషాల వరకు ఉంటుంది. సూర్య గ్రహణం అనేది సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు రావటం వలన కలుగుతుంది. 

ఆ సమయంలో భూమి మీద కొంత భాగంలో సూర్యుడు కనిపించరు. రాహువు అనే రాక్షసుడు సూర్యుడిని మింగేయడంవల్ల గ్రహణం ఏర్పడుతుందని చాలా మంది నమ్ముతారు. అలాగే మన జ్యోతిష్య నిపుణులు కూడా అలానే చెప్పుతారు. ఈ సంవత్సరంలో జులై 2 న రెండో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. భారతీయ కాలమాన ప్రకారం … జులై 2 బుధవారం రాత్రి 10.21 గంటలకు ప్రారంభం అయ్యి అర్ధరాత్రి 2.15 నిమిషాలకు ముగుస్తుంది. సుమారుగా ఈ సూర్య గ్రహణం నాలుగు గంటల పాటు ఉంటుంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణం. అయినా మన ఇండియాలో కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. ఉత్తరమెరికాలోని దక్షిణ ప్రాంతం, అర్జెంటీనా,చైనా ప్రాంతాలలో ఈ సంపూర్ణ సూర్య గ్రహణం కనపడుతుంది. 

అయితే ఆధ్యాత్మికంగా చూస్తే… గ్రహణానికి చాలా విశేషం ఉంది. గ్రహణం పట్టగానే పట్టు స్నానము చేసి జపాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే పుణ్యం వస్తుందని నమ్మకం. గ్రహణ సమయంలో భగవంతుణ్ణి స్మరించుకుంటే మంచిది. గ్రహణం పూర్తీ అయ్యాక విడుపు స్నానము చేస్తారు. గ్రహణం ఏర్పడిన రాశి,నక్షత్రం గలవారు జపాలు,దానాలు  చేయించుకుంటే మంచిది. రేపు ఏర్పడే సూర్యగ్రహణం ఆర్ద్ర నక్షత్రం, మిథునరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ నక్షత్ర కలిగిన వారు  దానాలు, జపాలు చేయాలి. అయితే ఈ సంపూర్ణ సూర్య గ్రహణం ఇండియాలో కనపడటం లేదు. కాబట్టి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. అయితే ఎక్కువ పట్టింపు ఉన్నవారు జపాలు,దానాలు చేసిన ఇబ్బంది ఏమి లేదు.

 అయితే ఈ గ్రహణం కారణంగా గర్భిణీ స్త్రీలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఏ గ్రహణం అయినా గర్భిణీ స్త్రీలపై ప్రభావం చూపుతుందని చాలా మంది నమ్ముతారు. ఖచ్చితంగా నియమాలను పాటిస్తారు. గ్రహణ సమయంలో బయటకు రాకూడదు. అలాగే గ్రహణం పట్టటానికి మూడు గంటలకు ముందే ఆహారాన్ని తీసుకోవాలి. గ్రహణ సమయంలో అసలు ఆహారాన్ని తీసుకోకూడదు. గ్రహణం రోజున సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి.. దీని కారణముగా  ఆహారపదార్థాలపై ఉన్న క్రిమికీటకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. 

ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. గర్భవతులు తమ తలకింద దర్బలను పెట్టుకుని పడుకుంటే పుట్టబోయే బిడ్డ ప్రహ్లాదుడి అంతటి వాడు అవుతాడని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ఇండియాలో కనపడదు కాబట్టి ఈ నియమాలు పాటించిన పర్వాలేదు… పాటించకపోయిన పర్వాలేదు. పాటిస్తే మంచిదే కదా అని కొంత మంది పాటిస్తారు.