అక్షయ్ కుమార్ సంపాదన ఒక్క ఏడాదికి ఏంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన ఫోర్బ్స్ సెలబ్రిటీల జాబితాలో భారత్ నుండి కేవలం అక్షయ్ కుమార్ ఒక్కరికే చోటు దక్కినట్లు తెలుస్తోంది. టేలర్ స్విఫ్ట్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ లిస్ట్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి 35వ స్థానం దక్కించుకున్నారు.ప్రతీ సినిమాకు 35 నుండి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే అక్షయ్ బాలీవుడ్ లోనే టాప్ ఎర్నింగ్ స్టార్ గా ఈ మ్యాగజైన్ రాసుకొచ్చింది. జూన్ 2018 నుండి ఈ ఏడాది జూన్ వరకు మొత్తం రూ.444 కోట్ల సంపాదనతో అక్షయ్ ఇంటర్నేషనల్ స్టార్లు రిహానా, జాకీచాన్, బ్రాడ్లీ కూపర్, స్కార్లెట్ జాన్సన్ లను అధిగమించారు.

సినిమాలు మాత్రమే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడు ఈ ఖిలాడీ స్టార్. ప్రస్తుతం అక్షయ్ దాదాపు ఇరవై బ్రాండ్లను అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ‘హౌస్‌ఫుల్‌ 4′,’గుడ్‌ న్యూస్‌’, ‘లక్ష్మీబాంబ్‌’, ‘సూర్యవంశీ’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.