Healthhealth tips in telugu

వాల్ నట్స్ అందరికీ మంచిది కాదా? ఈ సమస్యలు ఉన్నవారు తింటే ఎంత డేంజరో తెలుసా?

Walnuts Side Effects In Telugu : వాల్ నట్స్ (Walnuts) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తింటే తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు వాల్ నట్స్ ఎవరు తినకూడదు? తింటే ఏమవుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

వాల్ నట్స్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వాల్ నట్స్ తినటం కూడా ఎక్కువ అయింది. అయితే వాల్ నట్స్ (Walnuts) ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
WalNuts Benefits In telugu
వాల్ నట్స్ ప్రతి రోజు తింటే అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. గుండె జబ్బులు,అధిక బరువు,డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. వాల్ నట్స్ ని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. వాల్ నట్స్ తిన్నప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తే తినటం మానేయలి.

వాల్ నట్స్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు వస్తాయి. వాల్ నట్స్ తిన్నప్పుడు ఛాతీ బిగుతుగా లేదా శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తే మాత్రం అసలు తినకూడదు. అది అలెర్జీ కావచ్చు. వాల్ నట్స్ యాంటీక్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్డియో- మరియు న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.

అయిన సరే అల్సర్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా లిమిట్ గా తింటే ఎటువంటి సమస్యలు రావు. ఏదైనా ఎక్కువగా తింటే అనర్ధమే కదా…అయితే రోజుకి ఎన్ని వాల్ నట్స్ తినాలో…అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. రోజుకి రెండు వాల్ నట్స్ నీటిలో నానబెట్టి 5 గంటల తర్వాత తొక్క తీసి తింటే మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."