Sports

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన‌ వీరులు

ఉత్కంఠభ‌రితంగా సాగిన ఫైన‌ల్ పోరులో ఆతిథ్య ఇంగ్లండ్ విశ్వ‌విజేత‌గా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా అంద‌ని ద్రాక్ష‌గా ఉన్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను తొలిసారి ముద్దాడింది.

1. రోహిత్ శర్మ – 9 మ్యాచ్‌ల్లో 648 ప‌రుగులు చేసిన రోహిత్‌.. ఐదు సెంచ‌రీలు, ఒక హాఫ్ సెంచ‌రీ కూడా బాదాడు.
2. డేవిడ్ వార్న‌ర్‌ – 10 మ్యాచ్‌ల్లో 647 ప‌రుగులు… ఇందులో 3 సెంచ‌రీలు, మూడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.
3. ష‌కీబుల్ హాస‌న్‌- 8 మ్యాచ్‌ల్లో ష‌కీబ్ 606 ప‌రుగులు…రెండు సెంచ‌రీలు, ఐదు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.
4. కేన్ విలియ‌మ్స‌న్‌ – 10 మ్యాచ్‌ల్లో 578 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, రెండు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.
5. జో రూట్‌ – రూట్ 11 మ్యాచ్‌ల్లో 556 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచ‌రీలు కూడా ఉన్నాయి.