Teachers Day

మేకప్‌ ఉన్న గురువులు గురించి తెలుసుకుందామా…???

మేకప్‌ లేని గురువులు బడిలో ఉంటారు.మేకప్‌ ఉన్న గురువులు సినిమాల్లో ఉంటారు.కాని వారి పాఠాల్లో తేడా ఉండదు.వారి ఆదర్శాల్లో తేడా ఉండదు.వారు చూపించే మంచి మార్గంలో తేడా ఉండదు.దైవం కంటే ముందు మనిషి గురువునే తెలుసుకుంటాడు.తల్లిదండ్రుల చేయి తర్వాత గురువు చేయే పట్టుకుంటాడు.మంచి చెప్పాలనుకున్న సినిమాల్లో మంచి గురువు ఎప్పుడూ హిట్టే కొట్టాడు. నూటికి నూరు మార్కులు సాధించాడు. 

తెలుగు సినిమాల్లో పాపులర్‌ స్థాయిలో హీరో హీరోయిన్లు టీచర్లు అయ్యింది ‘మిస్సమ్మ’తోనే కావచ్చు. ఆ తర్వాత కాలక్రమంలో టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు తెలుగు సినిమాల్లో టీచర్ల గౌరవం పెంచారు. టీచరు హోదాకు తమ స్టార్‌డమ్‌ను కూడా ఇచ్చారు.

  • బడి పంతులు – ఎన్టీఆర్
  •  కోడెనాగు – శోభన్ బాబు
  •  విశ్వరూపం – ఎన్టీఆర్ 
  • శంకర శాస్త్రి – శంకరాభరణం 
  • ప్రతిఘటన – విజయశాంతి 
  • సుందరకాండ – వెంకటేష్ 
  • మాస్టర్ – చిరంజీవి 
  • సింహ – బాలకృష్ణ 
  • ఓనమాలు – రాజేంద్రప్రసాద్
  •  కొత్త బంగారులోకం – రావు రమేష్ 
  • గీత గోవిందం – విజయ్ దేవరకొండ 
  • బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, ఎల్బీ శ్రీరాం వంటి నటులు హాస్యం పుట్టించే లెక్చరర్‌ పాత్రలు వేశారు .