జాన్వీ కపూర్ హ్యాండ్ బ్యాగ్ ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..?
భారతీయ చలన చిత్ర రంగంలో తన అందచందాలతో నటించి మెప్పించిన అతిలోక సుందరి శ్రీదేవి గత ఏడాది కన్నుమూసిన విషయం తెలిసిందే. బాలనటిగా తన ప్రస్ధానం మొదలు పెట్టిన ఆమె సినీయర్ నటులతో నటించింది. ఆ తర్వాత తరం నటులతో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమయంలో బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది వీరికి జాన్వీ, ఖుషి కపూర్ కూతుళ్లు ఉన్నారు.
అయితే తన పెద్ద కూతురు జాన్వి కపూర్ ని హీరోయిన్ గా చూడాలని ఎంతగానో ఆశపడింది..ఆమె బతికి ఉండగానే ‘ధడక్’ సినిమా షూటింగ్ మొదలైనా..ఆమె చనిపోయిన తర్వాత రిలీజ్ అయ్యింది. జాన్వీకపూర్ ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటిగా తన సత్తా చాటింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో అమ్మడుకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. అతిలోక సుందరి కూతురు కావడంతో జాన్విపై కెమెరా కన్నులన్నీ ఆమెపైనే ఉంటాయి. జాన్వీ కపూర్ వెబ్ లో మీడియాకు బాగా ఇంట్రస్టింగ్ పర్సన్ గా కొనసాగుతూ ఉంది.ఈ క్రమంలో తాజాగా ఆమె లుక్స్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా జాన్వికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె జిమ్ వెళ్తున్నప్పుడు తీసే ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. అందమైన లుక్ తో కనిపిస్తున్న జాన్వీ పై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
స్పోర్ట్స్ బ్రా, షార్ట్ వేసుకున్న జాన్వీ చాలా క్యూట్ గా ఉంది.ఆమె ఎక్స్ ప్రెషన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.ఇదే సమయంలో ఆమె భుజానికి వేసుకున్న బ్యాగ్ పై కూడా ఫ్యాషన్ ఆసక్తిపరులకు చూపుపడింది. ఈ ఫోటోలో జాన్వీ ఓ కాస్ట్లీ బ్రాండ్ బ్యాగ్ ధరించింది. దాని ధర అక్షరాల నాలుగు లక్షల రూపాయలని అంటున్నారు. అంతే మరి ఉన్నవారు ఏదైనా మెయింటేన్ చేస్తారు కదా..అందులోనూ అందాల సెలబ్రెటీ ఆ మాత్రం బిల్డప్ ఉండాల్సిందే అంటున్నారు అభిమానులు