అసిస్టెంట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ రాశి లవ్ స్టోరీ వింటే నోరెళ్లబెడతారు

చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్స్ గా ఎదిగి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న తారల్లో హీరోయిన్ రాశి ఒకరు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈమె ఎవరిని పెళ్ళాడుతుందా అని అందరూ అప్పట్లో ఎదురుచూసారు. అయితే కేవలం నెలరోజుల్లోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ పెళ్లి చేసుకుంది. 2003లో ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు అనే సినిమా లో నటిస్తున్న సమయంలో అసోసియేట్ డైరెక్టర్ శ్రీనివాస్ తో ఏర్పడ్డ పరిచయమే పెళ్ళికి దారితీసింది. దీంతో ఇండస్ట్రీలో షాక్ నెలకొంది.

సినిమా షూటింగ్ సమయంలో శ్రీనివాస్ ని గమనించిన రాశి అతన్ని ఏడిపించాలని తన సహాయకురాలిని పిలిచి,చెవిలో ఎదో చెప్పడంతో ఆమె అతడి దగ్గరికి వెళ్లి రాశి మీ గురించి ఏదో అంటున్నారండీ అని చెప్పిందట. ఏం చెప్పిందో మాత్రం చెప్పలేదట. దీంతో కంగారులో ఉన్న అతడు రాశి దగ్గరకు వెళ్లి మేడం ఎదో అన్నారట ఏమిటండీ అని అడగడం,రాత్రి ఫోన్ చేసి చెబుతాలే అనడం జరిగాయట. అన్నమాట ప్రకారం రాత్రి ఫోన్ చేసి ,మీరు బాగా కష్టపడుతున్నారండీ,త్వరలో పైకి వస్తారండీ అని చెప్పిందట. అలా రోజూ ఫోన్ లో మాట్లాడుకోవడం ద్వారా షూటింగ్ జరిగే కొద్దీ ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు.

ఆ సినిమా షూటింగ్ అయ్యాక కూడా ఇద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ నడిచింది. అలా ఇద్దరి మధ్యా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోవడం జరిగింది. ఉన్నట్టుండి 2004మార్చి23న తనను పెళ్లాడాతారా అని రాశి ప్రపోజల్ చేయడంతో శ్రీనివాస్ ఖంగు తిన్నాడు. షాక్ నుంచి తేరుకుని ఒకే చెప్పాడు. ఇక ఇంట్లో కూడా ఆమె విషయం చెప్పడంతో ఇంట్లో కూడా ఒకే చెప్పేసారు. శ్రీనివాస్ ఇంట్లో కూడా ఒకే చేయడంతో అదే ఏడాది ఏప్రియల్ 23న ఇద్దరికీ పెళ్లి అయింది. ఇద్దరికీ ఓ పాప ఉంది. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అంటూ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పింది. ఇక ఆఫర్స్ కూడా వచ్చిపడుతున్నాయట.

error: Content is protected !!