షష్టి పూర్తి వచ్చిన కూడా స్టార్ హీరోస్ వీరే
వయస్సు మీద పడే కొద్దీ ఇబ్బందులు సహజం. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే వయస్సు ముదురుతున్న వాళ్లకు అంతగా ఛాన్స్ లు రావు. హీరో హీరోయిన్స్ ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి పరిమితం కావాల్సిందే. హీరోయిన్స్ 30ఏళ్ళు దాటితే ఇండస్ట్రీలో నిలబడ్డం కష్టం. అయితే హీరోలకు అయితే 40,50కాదు 60ఏళ్ళు దాటి,షష్టి పూర్తి చేసుకున్నవాళ్ళు సైతం ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. అందం, ఆరోగ్యం కాపాడుకుంటూ 25ఏళ్ళ కుర్రాళ్ళలా సినిమాల్లో రాణిస్తున్నారు. తమ వారసులు సినిమాల్లో నటిస్తున్న సరే, వీళ్ళు కూడా తమ స్టామినా చూపిస్తూ,దూసుకెళ్తున్నారు.
కింగ్ నాగార్జున 60ఏళ్ళు దాటినప్పటికీ నవమన్మధుడిగా ఉంటాడు. ఇటీవల మన్మధుడు 2 మూవీ చిట్ చాట్ లో నాగ్ తన వయస్సు,షష్టిపూర్తి గురించి మాట్లాడేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసారు. ఎందుకంటే వయస్సు దాచుకునే ప్రయత్నం చేయలేదు. స్పెయిన్ లో ఈయన షష్టిపూర్తి వేడుకలను ఆయన వారసులు ఘనంగా చేసారు. ఇక మెగాస్టార్ చిరంజీవి షష్టి పూర్తి అవ్వడమే కాదు ప్రస్తుతం 64ఏళ్ళ వయస్సులో ఉన్నారు.సైరా సినిమా ఇచ్చిన హిట్ తో ఇప్పుడు 152వ సినిమా కొరటాల శివ తో సై అంటున్నాడు.
చిరంజీవి పదవీ విరమణ గురించి ఏమీ చెప్పలేదు. పైగా కొత్తగా తీసే సినిమా పూర్తవ్వడానికి రెండేళ్లు ఎలాగూ పట్టేస్తుంది. అందుచేతే 70దాకా ఆయన నటించడం గ్యారంటీ. నందమూరి వారసుడు బాలయ్య 59ఏళ్ళ వయస్సులో కూడా తొడ కొడుతూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 105వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోపక్క విక్టరీ వెంకటేష్ 58ఏళ్ళ వయస్సులో రాణిస్తూ, త్వరలో 60కి చేరుకోబోతున్నాడు. మొన్న సంక్రాంతికి ఎఫ్2తో సూపర్ హిట్ కొట్టాడు. అంతేకాదు అల్లుడు నాగచైతన్యతో వెంకీ మామ అంటూ వచ్చే సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు. కథల ఎంపికలో వైరుధ్యం చూపిస్తూ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నాడు.