టాలీవుడ్ టాప్ 10 విలన్స్ షాకింగ్ రెమ్యూనరేషన్
ఓ సినిమా హిట్ కొట్టాలంటే హీరో కంటే విలన్ బలంగా ఉండాలి. విలన్ బలవంతుడిగా లేకుంటే సినిమా దెబ్బతింటుంది. హీరో రాజమౌళి ఇదే సూత్రాన్ని ఒంటబట్టించుకుని బలమైన విలన్ ని పెడతారు. ఇందుకోసం ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి వెనుకాడడం లేదు. డబ్బులు బాగా వస్తున్న నేపథ్యంలో చాలామంది హీరోలు ఇప్పుడు విలన్ అవతారం ఎత్తేస్తున్నారు. ఇక హీరోగా నటిస్తే జయాపజయాలను మోయాలి. పైగా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మించి రావు. అదే విలన్ అయితే ఎన్ని మూవీస్ అయినా చేసేయొచ్చు. ఇక డబ్బులకు డబ్బులు కూడా.
జగపతి బాబు హీరోగా ఉన్నప్పటి కంటే విలన్ గానే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక్కో సినిమాకు రెండు కోట్లు తీసుకుంటున్నాడట. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి మెప్పించే ప్రకాష్ రాజ్ విలన్ గా చేయడానికి కోటిన్నర అందుకుంటున్నాడట. అరుంధతి లో విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనీ సూద్ భాషతో సంబంధం లేకుండా నటిస్తున్నాడు. ఒక్కో సినిమాకు 20నుంచి కోటి రూపాయలు ఛార్జి చేస్తున్నాడట. హీరోగా ఉంటూ ఇటీవల వినయ విధేయరామ,కల్కి వంటి సినిమాల్లో విలన్ గా చేసి, ఒక్కో సినిమాకు 50లక్షలకు పైనే డిమాండ్ చేస్తున్నాడట. ఇక వివేక్ ఒబెరాయ్ ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైనే సంపాదిస్తున్నాడట.
రేసుగుర్రం నుంచి విలన్ గా వేస్తున్న రవికిషన్ ఇటీవల సైరా మూవీలో తన పాత్రకు 50లక్షల దాకా డిమాండ్ చేసాడట. మిర్చి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంపత్ రాజ్ ఒక్కో సినిమాకు 60నుంచి 70లక్షలు తీసుకుంటున్నాడట. నటుడు సాయికుమార్ ఎవడు సినిమాలో విలన్ గా మెప్పించాడు. ఒక్కో సినిమాకు 50లక్షలకు పైనే అందుకుంటున్నాడట. స్టార్ హీరో సుదీప్ ఈగ సినిమాతో మంచి విలన్ గా గుర్తింపు పొందాడు. కొత్తగా తీసే హిందీ సినిమాకు మూడు కోట్లు తీసుకుంటున్నాడట. హీరో అది పినిశెట్టి సపోర్టింగ్ రోల్స్ తో పాటు విలన్ గా చేసే పాత్రలకు కోటి రూపాయలు పొందుతున్నాడట. హీరో శ్రీకాంత్ యుద్ధం శరణం సినిమాలో నెగెటివ్ రోల్ వేసి,50లక్షలకు పైనే అందుకుంటున్నాడట.