Movies

ఆ హీరోయిన్స్ కి వజ్రాల ఉంగరాలు ఇచ్చిన సావిత్రి – ఎందుకో తెలుసా ?

సినీ రంగంలో సావిత్రి పేరుచెప్పగానే తమ కున్న అనుబంధాన్ని చాలామంది చెప్పుకొస్తుంటారు. ఆమె వేసిన ముద్ర అలాంటిది. ఇక మహానటి సినిమా తర్వాత ఒక్కొక్కరు తమ విశేషాలను మరింతగా చెప్పడం విశేషం. ఇటీవల మరణించిన నటి గీతాంజలి కి సావిత్రి అంటే ఎంతో అభిమానమట. సావిత్రితో కల్సి ఎన్నో సినిమాల్లో చేసింది. సావిత్రి హీరోయిన్ గానే కాదు డైరెక్టర్ గా కూడా వ్యవహరించిన సంగతి తెల్సిందే.

సావిత్రి అప్పట్లో నవరాత్రి సినిమాకు డైరెక్టర్ గా పనిచేసింది. నిజానికి ఈ సినిమాకు తాతినేని రామారావు డైరెక్టర్ గా పేరు వేసినప్పటికీ పర్యవేక్షణ మొత్తం సావిత్రి చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఓ విశేషాన్ని గీతాంజలి ఆ మధ్య ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది. నవరాత్రి మూవీలో టాలీవుడ్ లో బిజీగా ఉన్న నటీమణులు, హీరోయిన్స్ ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తారు. హాస్య నటీమణులు గిరిజ,ఛాయాదేవి,సూర్యకాంతం,హీరోయిన్స్ జయలలిత,కాంచన,జమున లతో పాటు గీతాంజలి తదితరులు నవరాత్రి మూవీలో అతిధి పాత్రలో నటించారు.

హాస్పిటల్ లో చిత్రీకరించిన ఓ పాటలో వీరంతా కనిపిస్తూ మతిభ్రమించిన వాళ్ళలా అల్లరి చేస్తారు. రాత్రి 7.30గంటలకు చిత్రీకరణ మొదలుపెట్టి రెండోరోజు ఉదయం 6గంటలకల్లా పూర్తిచేశారు. ఈ నటీమణులంతా బిజీగా ఉంటూ కూడా ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. దీంతో ఈ ఏడు గురికి సావిత్రి బెనారస్ పట్టుచీరలు పెట్టడమే కాదు వెయ్యి రూపాయల విలువ చేసే వజ్రాల ఉంగరాలు కూడా ఇచ్చిందని గీతాంజలి చెప్పుకొచ్చారు. మా పిచ్చోళ్ళు ఎంత బాగా చేసారో అని ఆమె ఆనందపడ్డారట. అప్పట్లో వెయ్యి అంటే ఇప్పట్లో లక్ష అన్నమాట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."