Movies

గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా…బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఒక గ్యాంగ్ కి లీడర్ గా నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటి లక్ష్మి,శరణ్య,అనీష్ కుర్వీల్,ప్రియదర్శి,రఘుబాబు,వెన్నెల కిషోర్,బేబీ ప్రాణ్య కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా బేబీ ప్రాణ్య అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. ఏడేళ్ల వయస్సులో ఎంతో జ్ఞాపక శక్తి కలిగి,సెట్ లో అందరితో చనువుగా ,నవ్విస్తూ ఉండేదట.

అయితే బేబీ ప్రాణ్య తెలుగు అమ్మాయి కాదు. ఈమె కన్నడంలో 10సినిమాలు,సీరియల్స్ లో పాపులర్ అయింది. తన టాలెంట్ ని టిక్ టాక్ ద్వారా వరల్డ్ కి పరిచయం చేసిన ప్రాణ్య తెలుగులో తొలిసినిమా అయినా సరే,గ్యాంగ్ లీడర్ మూవీ షూటింగ్ చివరికి వచ్చేసరికి తెలుగులో చిన్న చిన్న పదాలు పలకడం కూడా నేర్చుకుంది. ప్రాణ్య తండ్రి పేరు ప్రదీప్,తల్లి సుకన్య. ప్రాణ్యకు మాలిని అనే చెల్లి ఉంది. కూతురిలో టాలెంట్ గుర్తించిన తల్లి సుకన్య జాబ్ వదిలేసి అన్నీ తానై చూసుకుంటోంది.

ఐదేళ్ల వయసులోనే ప్రాణ్య సీరియల్ లో నటించి,ముద్దు ముద్దు అనే షార్ట్ ఫిలిం లో కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిలిం లో నటనకు మన హృదయం కూడా కదిలిపోతుంది. ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా షార్ట్ ఫిలిం లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు సొంతం చేసుకుంది. కన్నడంలో రక్షిత చెట్టి నటిస్తున్న చార్లీ 777 సినిమాలో ప్రాణ్య నటిస్తోంది.