తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్స్

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి అనారోగ్యం బారిన పడక తప్పదు. సినీ హీరోయిన్స్ కూడా ఇందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. అయితే అనారోగ్యాన్ని సైతం కనబడనీయకుండా వెండితెరపై తమ నటనతో అలరిస్తుంటారు. ఇది చూసిన ఆడియన్స్ వీళ్లకు ఏ రోగాలు లేవని అనుకుంటారు. అందంగా కనిపించినంత మాత్రాన అనారోగ్యం పోదుకదా.

సోనాలీ బింద్రే కాన్సర్ బారిన పడి, ఇటీవల ఉపశమనం పొందింది. బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఉల్లాల్ తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఎక్కువ సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత అసలు కనపడ్డం లేదు. దీనికి కారణం 30నిముషాలు కూడా సరిగ్గా నిలబడలేదట. అంతలా రక్త హీనతతో బాధ పెడుతోందట. అందుకే సినిమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటోంది.

అటు తమిళం ఇటు తెలుగులో నెంబర్ వన్ గా దూసుకెళ్తున్న నయన తార చర్మ వ్యాధితో ,ఎర్రటి మచ్చలతో బాధపడుతుందట. సమంత కూడా ఒకరకమైన చర్మ వ్యాధితో బాధ పడుతోందట. ముఖం మీద మేకప్ తో కవర్ చేసినా నడుం దగ్గర ఉండడంతో చాలా ఇబ్బంది ఫీలవుతోందట.