చిరుతో బాలయ్యకు ఉన్న విభేదాలు ఇలా బయట పడ్డాయా…???
టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా చిరంజీవి బాలకృష్ణలకు ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకం.రెండు దశాబ్దాలుగా వీరిద్దరు స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలారు.ఇప్పటికి వీరిద్దరికి స్టార్స్ అనే గుర్తింపే ఉంది.అయితే చాలా ఏళ్లుగా వీరిద్దరి మద్య విభేదాలు ఉన్నాయంటూ గుసగుసలు వస్తూనే ఉంటాయి.
ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.తాజాగా వారిద్దరి మద్య విభేదాల గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి.ఇద్దరు కొన్ని వేడుకల్లో కలిసి పాల్గొన్నా కూడా ఎక్కువ సార్లు ఇద్దరు కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఇటీవలే 1980 స్టార్స్ రీ యూనియన్ జరిగింది.ఈ కార్యక్రమం చిరంజీవి ఇంట్లో వైభవంగా జరిగింది.చిరంజీవి ఇంట్లో జరగడం వల్ల బాలకృష్ణ హాజరు కాలేదు అంటూ సినీ వర్గాల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నా కూడా చిరంజీవి ఇంట్లో అవ్వడం వల్లే బాలయ్య ఈ వేడుకకు దూరంగా ఉన్నాడంటూ అంతా అనుకుంటున్నారు.చిరంజీవిపై బాలయ్యకు మొదటి నుండి అసూయ ఉంటుందని అందుకే ఈసారి రీ యూనియన్ కార్యక్రమంలో పాల్గొనలేదు అంటున్నారు.గతంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సమయంలో బాలయ్య పాల్గొన్నాడు.
కాని ఈసారి మాత్రం చిరంజీవి కారణంగా హాజరు అవ్వలేదు అంటున్నారు.వీరిద్దరి మద్య విభేదాలు ఇలా బహిర్గతం అయ్యాయి అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.బాలయ్య హాజరు కాకపోవడంను కొందరు తప్పుబడుతున్నారు.చిరంజీవి ఇంట్లో అయినంత మాత్రన రాకుండా ఉంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి బాలయ్య హాజరు కాకపోవడంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.