Movies

బిగ్ బాస్ వల్ల వరుణ్ కి ఎన్ని ఆఫర్స్ వచ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

బిగ్‌బాస్‌ షో అనేది ప్రపంచంలోనే బిగ్గెస్ట్‌ షో.అందుకే ఆ షోలో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు.బిగ్‌బాస్‌ షో వల్ల చాలా మంది కెరీర్‌లు టర్న్‌ అయిన దాఖలాలు ఉన్నాయి.ముఖ్యంగా బాలీవుడ్‌లో బిగ్‌బాస్‌ ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు.కాని తెలుగు బిగ్‌బాస్‌ ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు.బిగ్‌బాస్‌ వల్ల నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారని సోషల్‌ మీడియా టాక్‌ కూడా ఉంది.

బిగ్‌బాస్‌ తెలుగు రెండు సీజన్‌లలో విజేతగా నిలిచిన వారే కాకుండా ఇతరులు ఎవరు కూడా పెద్దగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడం కాని ఇతర రకంగా సక్సెస్‌ అవ్వడం కాని కనిపించలేదు.కాని సీజన్‌ 3 లో పాల్గొని టాప్‌ 5 లో నిలిచిన వరుణ్‌ సందేశ్‌కు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.విజేతగా నిలిచిన రాహుల్‌కు పదుల సంఖ్యలో పాటలు పాడే అవకాశం రాగా వరుణ్‌ సందేశ్‌కు సినిమాల్లో ఛాన్స్‌లు వస్తున్నాయి.

2015లో లవకుశ చిత్రం తర్వాత వరుణ్‌ సందేశ్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.మళ్లీ ఇప్పుడు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత వరుణ్‌ సందేశ్‌కు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.ప్రస్తుతానికి రెండు సినిమాలకు వరుణ్‌ ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.అందులో ఒకటి మల్టీస్టారర్‌ అవ్వగా మరోటి సోలో హీరోగా నటించబోతున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా వరుణ్‌ కు మళ్లీ బూస్ట్‌ను ఇస్తాయా చూడాలి.పలు కథలు విన్న తర్వాత వీటిని ఎంపిక చేసుకున్నాడట.సోలో హీరోగా నటించబోతున్న సినిమా వరంగల్‌ నేపథ్యంలో ఉంటుందని, కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది.ఇక మల్టీస్టారర్‌ సినిమాకు సంబంధించిన విషయాలు ఏమీ ఇంకా బహిర్ఘతం కాలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."