నాగబాబు వెళ్లినా వాళ్లిద్దరు ఉండగా ‘జబర్దస్త్’కు ఎలాంటి ఇబ్బంది లేదు
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లి తెరను షేక్ చేస్తూ వస్తున్న జబర్దస్త్ కామెడీ షో ప్రస్తుతం కష్టాల్లో పడిందంటూ జనాలు వాపోతున్నారు.మొన్నటి శనివారం ఎపిసోడ్‌తో జబర్దస్త్‌కు కాలం చెల్లినట్లే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబుతో పాటు కొందరు కమెడియన్స్ వెళ్లి పోవడంతో ఇక షోను జనాలు ఏం చూస్తారో అని చాలా మంది అనుకుంటున్నారు.కాని జబర్దస్త్ అనేది ఒక బ్రాండ్‌గా నిలిచి పోయింది.
దాంట్లో ఎవరు ఉన్నా లేకున్నా కూడా కామెడీ ఉంటే నడిచి పోతుంది.అందుకే సుధీర్ మరియు హైపర్ ఆదిల టీంలు ఉంటే జబర్దస్త్లో ఎవరు ఉన్నా లేకున్నా పర్వాలేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సుధీర్ హీరోగా నటిస్తున్నా కూడా జబర్దస్త్‌ను మాత్రం వదల్లేదు.
అలాగే ఆది కూడా సినిమాల్లో నటిస్తు జబర్దస్త్‌ను వదల్లేదు.అందుకే వారిద్దరూ ఖచ్చితంగా చివరి వరకు కూడా బుల్లి తెర సెన్షేషన్ జబర్దస్త్‌ను వదలరు అంటూ టాక్ వస్తుంది. నాగబాబు వెంట ఆది మరియు సుధీర్‌లు వెళ్లడం జరుగుతుందని చాలా మంది అనుకున్నారు.కాని ఆ వార్తలు నిజం కాదని ఇద్దరు కూడా వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్‌లో ఉండబోతున్నారంటూ ప్రోమోలు చూస్తే తేలిపోయింది.ప్రమోల్లో వీరిద్దరు ఉండటంతో షోకు వచ్చిన నష్టం ఏమీ లేదు అంటున్నారు.
జబర్దస్త్‌లో చిన్న చిన్న మార్పులు చేసి షోను మళ్లీ పుంజుకునేలా చేస్తున్నారు.రోజా సోలోగా జడ్జ్‌మెంట్ ఇస్తోంది.అనసూయ కూడా జబర్దస్త్‌ను వీడేది లేదు అంటూ తేల్చి చెప్పింది.కనుక జబర్దస్త్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని అంటున్నారు.