Movies

టాలీవుడ్ కి సావిత్రి వల్ల ఎన్ని ఆటలు పరిచయం అయ్యాయో తెలుసా….???

అలనాటి సహజ నటి సావిత్రి గురించి మహానటి సినిమా వచ్చాక బాగా తెల్సింది.నాగ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మహానటి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కి ఉత్తమ నటిగా అవార్డుతో పాటు జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత సావిత్రి కి సంబంధించిన ఇంకా ఎన్నో విషయాలు వెలుగుచూస్తున్నాయి. తెలుగువారికి కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సావిత్రి అంటే ఎవరో తెలుసు. డిసెంబర్ 6న జన్మించిన సావిత్రమ్మ పౌరాణిక,సాంఘిక సినిమాల ద్వారా నటిగా బాగా పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్,జగ్గయ్య నడిపిన నాటక కంపెనీలలో కూడా ఆమె పనిచేసింది. 13ఏళ్ళ ప్రాయంలోనే కాకుండా ఆంద్ర్ నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటిక పోటీల్లో గెలుపొందిన సావిత్రి అప్పటి బాలీవుడ్ నటుడు పృథ్విరాజ్ కపూర్ చేతులమీదుగా అందుకున్నారు.

పాతాళ భైరవి మూవీలో చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సావిత్రి ఆతర్వాత వేదాంతం రాఘవయ్య డైరెక్షన్ లో వచ్చిన దేవదాస్ మూవీతో స్టార్ హీరోయిన్ అయింది. మిస్సమ్మ,అర్ధాంగి,దేవదాసి,చరణ దాసి,మాయాబజార్ మూవీస్ తో బాగా పాపులర్ అయింది. హిందీ పరిశ్రమతో సంబంధం కూడా గల ఈమె ఓ హిందీ చిత్రాన్ని సొంతంగా నిర్మించింది. ఈవిధంగా ఆర్ధిక నష్టం కూడా ఎదుర్కొంది. జెమిని గణేశన్ తో పెళ్లయ్యాక వైవాహిక జీవితంలో ఎన్నో లోటుపాట్లు చూసింది. అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చేది. అందుకే ఆర్ధికంగా ఆమె పతనం అవ్వడానికి ఇదొక కారణమని చెబుతారు.

గుండమ్మ కథ,డాక్టర్ చక్రవర్తి ,మూగమనసులు,ఆరాధన,సుమంగళి,దేవత ఇలా ఎన్నో సినిమాలతో సావిత్రి తన నటనతో జనాన్ని కట్టిపడేసింది. మూగమనసులు మూవీ ఆమెకు ఎంతగా నచ్చిందంటే,తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తానే స్వయంగా నిర్మిస్తూ,దర్శకత్వం వహిస్తూ రీమేక్ చేసింది. క్రికెట్ అంటే ఇష్టపడే ఈమె తారలంతా కల్సి క్రికెట్ ఆడే సంప్రదాయాన్ని కూడా ప్రవేశపెట్టిందని అంటారు. అలాగే చదరంగం అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. అందుకే ఆమె ఇంట్లో ఏనుగు దంతాలతో చేసిన అతిపెద్ద చదరంగం బల్ల ఉండేదట. మిమిక్రి కూడా తెల్సిన సావిత్రి, జెమిని గణేశన్,బి సరోజాదేవి,ఎస్వీ రంగారావు తదితరుల గొంతులను మక్కీకి మక్కీ అనుకరించేదట.