Movies

అనీల్ రావిపూడిని ఈ స్థాయిలో నిలబెట్టింది ఎవరో తెలుసా?

దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరు.తన మొట్టమొదటి చిత్రం “పటాస్” నుంచి ఇటీవలే విడుదలైన “సరిలేరు నీకెవ్వరు” వరకు ఒకదాన్ని మించిన మరొక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారారు.అయితే మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే దాని తాలూకా మూలాలు మాత్రం ఎన్నడూ మర్చిపోకూడదు అన్న విషయాన్ని అనీల్ ఆలీ షో ద్వారా ఓసారి గుర్తు చేసుకున్నారు.అనీల్ ను టాలీవుడ్ కు దర్శకునిగా పరిచయం చేసింది.నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అని అందరికీ తెలిసిందే.

కానీ అసలు ఆ చిత్రం ఎలా స్టార్ట్ అయ్యిందో దానికి ముందు ఎంత స్ట్రగుల్ పడ్డారో అనీల్ ఈ షో ద్వారా తెలిపారు.అప్పటికే కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో “ఓం” చిత్రం తీసి పరాజయం పాలయ్యారు.మళ్ళీ ఆ సమయంలో తనకి కొంచెం గ్యాప్ కావాలని తనని అడిగడమే కాకుండా మళ్ళీ తన బ్యానర్ లోనే అంటే కొంచెం ఆలోచించారని ఆ సమయంలో తాను ఇతర నిర్మాతలను ఈ కోసం ట్రై చేస్తుంటే ఎవరూ కూడా అంత సానుకూలమైన స్పందనను ఇచ్చేవారు కాదనీ కానీ ఆ టైంలో కళ్యాణ్ రామ్ గారు తనని తన ఆఫీస్ కి పిలిచి సాధ్యమైనంత వరకు మనం ట్రై చేద్దాం లేకపోతే ఈ చిత్రాన్ని తన బ్యానర్ లోనే చేద్దామని మాటిచ్చారని అది మాత్రం తన లైఫ్ లో మర్చిపోలేనని అనీల్ తెలిపారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."