Movies

అల వైకుంఠపురంలో క్లైమాక్స్ సాంగ్ రాసిందెవరో తెలుసా ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో అన్ని పాటలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ లో రాసిన గీతం బాగా ఆకట్టుకుంది. అయితే దీనివెనుక చాలా కథే ఉంది. శీకాకుళం యాసతో సిత్తరాల అంటూ చాలానే ఛమత్కారంగా రాసిన ఈ జానపద గేయం పాపులరైన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ సాంగ్ రాసిన ఆ రైటర్ ఎవరో తెలుసా. ఈ పాట శ్రీకాకుళం- ఒడిస్సా బార్డర్ వ్యక్తి రాశారట. ఎల్ ఐసీ సీనియర్ ఉద్యోగి బల్లా విజయకుమార్ రచన ఇది. ప్రస్తుతం అతడి పేరు ఇంటా బయటా మార్మోగుతోంది.

ఇంతకీ విజయకుమార్ నేపథ్యం లోకి వెళ్తే, ఒడిషాలోని జయపూర్ లో ఉంటారు. ‘ఎల్ ఐసీలో ఉద్యోగ రీత్యా నాగావళి నుంచి వంశధార వరకు తిరిగాను. . ప్రస్తుతం మచిలీపట్నం ఎల్ ఐసీ డివిజన్ కార్యాలయంలో ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీలో మేనేజర్ గా పనిచేస్తున్నా’అని విజయకుమార్ వెల్లడించారు. ‘గజల్స్- జానపద గేయాలంటే చాలా ఇష్టం. ఎల్ ఐసీ నన్ను ఊరూరా తిప్పి అక్కడి జనపదాలను పరిచయం చేసింది. శ్రీకాకుళం- రాజాం- విజయనగరం- విజయవాడ- గాజువాక- వరంగల్ లో పనిచేశా’అని తెలిపారు.

ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చిన్నచిన్నగా రాసిస్తుంటానని, ఈ క్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు సీవీఆర్ శాస్త్రిగారితో మంచి అనుబంధం ఏర్పడింద ని విజయకుమార్ చెప్పారు. ‘హుద్ హుద్ తుపాను సమయంలో నేను రాసిన సంకల్ప్ గీతం ఆయనకు బాగా ఇష్టం. అందువల్ల అల వైకుంఠపురంలో శ్రీకాకుళం యాసలో జానపద గేయం కావాలని దర్శకుడు త్రివిక్రమ్ తన టీంతో ఆరా తీస్తున్నారు. సీవీఆర్ శాస్త్రి గారు నా గురించి త్రివిక్రమ్ గారికి చెప్పారంట. ఆయన తన టీంతో శ్రీకాకుళంలో బాగా ప్రజాదరణ పొందిన జానపద గేయాలు అన్వేషించమని కోరారు. అలా జానపదాల పరిశోధకులు భద్రి కూర్మారావు.. రేలరేల జానకిరావుతోపాటు చాలా మందికి ఈ విషయాన్ని చెప్పాను. రకరకాలు పరిశీలించి ఏదీ కాదనుకుని చివరికి పల్లవి.. ఏడెనిమిది చరణాలు రాసిచ్చాను. అది సిత్తరాల పాటగా పాపులరైంది అని విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.