Movies

ఖుష్బూ కాఫీ అలవాటు మాన్పించిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

కుష్భు గారికి షూటింగ్ లో ఉన్నప్పుడు కాఫీ ఇస్తే ప్రొడక్షన్ స్టాఫ్ కాళ్ళు విరగగొడతాను అని వార్నింగ్ ఇచ్చిన హీరో వెంకటేష్. ఖుష్బూ గారు ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ లో సెటిల్ అయినా, ఆవిడ మొదటి చిత్రం మాత్రం, వెంకటేష్ గారికి జోడిగా” కలియుగ పాండవులు” అనే సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన చిత్రం.చిత్ర నిర్మాణం లో ఉన్నప్పుడు ఖుష్బూ గారు రోజు 25 నుంచి 30 కాఫీలు తాగేవారట, ఆ విషయం తెలిసిన వెంకటేష్ గారు ప్రొడక్షన్ స్టాఫ్ కు వార్నింగ్ ఇచ్చి ఖుష్బూ గారికి కాఫీ అందకుండా చేశారట.

ఎన్ని సార్లు కాఫీ అడిగిన ప్రొడక్షన్ బాయ్ కాఫీ ఇవ్వకపోవటం తో అతడిని పిలిచి అడిగిన ఖుష్బూ గారికి అసలు విషయం తెలిసింది. వెంకటేష్ గారు ఖుష్బూ ను పిలిచి రోజుకు అన్ని కాఫీలు తాగితే హెల్త్ పాడవుతుంది, మానెయ్యమని చెప్పారట, అప్పటినుంచి వెంకటేష్ గారి సలహా పాటిస్తూ కాఫి తాగటం మానేశారు. ఎప్పుడయినా షూటింగ్ లో మహా అయితే ఒక కాఫీ తాగితే ఎక్కువ. అదండీ ఖుష్బూ గారి కాఫీ కథ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."