Movies

తమ తోటి హీరోలకు తండ్రి పాత్రలు పోషిస్తున్న టాలీవుడ్ హీరోలు వీరే..

సినిమా రంగంలో చిత్ర విచిత్రాలెన్నో జరుగుతుంటాయి. వయసులో చిన్నవాళ్ళైనా పెద్ద పాత్రలు,బరువైన పాత్రలు వేస్తుంటారు. పెద్దవాళ్ళు అవుతున్న కుర్ర హీరోలతో పోటీపడి నటిస్తుంటారు. గతంలో చిన్నవాడైన గుమ్మడి వెంకటేశ్వరరావు తండ్రి పాత్రల్లో అందునా ఎన్టీఆర్,అక్కినేనిలకు బాబాయి,అన్నయ్య పాత్రల్లో వేసాడు. నిజానికి గుమ్మడి వాళ్ళిద్దరి కన్నా ఐదేళ్లు చిన్నవాడు.

ఇక ఇప్పుడు కూడా అలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి. హీరో చంద్రమోహన్ ఒకప్పుడు వెంకటేష్, నాగార్జున లతో సమానంగా హీరో వేషం వేసి,ఇపుడు వాళ్లకు తండ్రిగా, బాబాయిగా అన్నగా వేస్తున్నాడు. అదే తరహాలో నరేష్,రాజేంద్ర ప్రసాద్ లు కూడా ఒకపుడు హీరోలుగా నటించి ఇప్పుడు తండ్రి, బాబాయ్ పాత్రల్లో ఒదిగిపోతున్నారు. కానీ వీళ్ళ వయస్సులో గల హీరోలు ఇంకా హీరోలుగా రాణిస్తున్నారు.

ఆయా హీరోలకు గల స్టార్ డమ్ ఇమేజ్ లను దృష్టిలో పెట్టుకుని కొందరు ఇంకా హీరోలుగా రాణిస్తుంటే, మరికొందరు ఇలా తండ్రి,బాబాయి పాత్రలకు పరిమితం కావాల్సి వస్తోంది. చివరకు మోహన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు,శివాజీ రాజా వంటి వాళ్ళు కూడా పెద్ద తరహా పాత్రలకే పరిమితం అయ్యారు.