Movies

ఏ దిక్కు లేక అలాంటి పాత్రలు చేసిన చివరకు ఏమి మిగిలింది

ఒకప్పుడు హీరోగా రాణించి తరువాత ఛాన్స్ లు తగ్గిపోయి విలన్ గా మారేవాళ్ళూ ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా టర్న్ అయ్యేవాళ్ళూ ఉన్నారు. అయినా కానీ వాళ్ళ కెరీర్ టర్న్ కావడం లేదని టాక్. అయినా సరే కొందరు తప్పులు చేస్తూ పోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు కామెడీ హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అల్లరి నరేష్ టైం బాగోక ఏది వచ్చినా రెడీ అంటూ మహర్షి మూవీలో మహేష్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు. ఆ రోల్ లో యాక్టింగ్ బాగున్నా సరే, అతడికి ఈ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు. సినిమా కోసం మహేష్ బాగానే అల్లరి నరేష్ ని వాడుకున్నాడని టాక్.

ఇక అక్కినేని మనవడు సుశాంత్ కూడా అలవైకుంఠపురంలో చేసిన క్యారెక్టర్ లో పెద్దగా డైలాగ్స్ లేవు. హీరోగా రెండేళ్లకోసారి ఓ సినిమా చేస్తూ కెరీర్ కాపాడుకునే యత్నం చేస్తున్న సుశాంత్ తాను హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చూద్దామని భావించి, అలవైకుంఠపురంలో చేసిన పాత్ర పెద్దగా ప్రాముఖ్యం లేకుండా పోయింది. అయితే తన పరిధి మేరకు బాగానే నటించాడు. అయితే ప్లస్ అవుతుందనుకుని నటిస్తే,నిరాశ మిగిల్చిందని చెప్పాలి. ఎందుకంటే అసలు మాట్లాడే ఛాన్స్ ఈ పాత్రలో చాలా తక్కువ రావడం మైనస్ అయింది.

ఒకప్పుడు ఐశ్వర్యా రాయ్ తో కల్సి నటించిన జీన్స్ హీరో ప్రశాంత్ సైతం కెరీర్ కోసం సైడ్ రోల్స్ కి దిగాడు. వినయ విధేయ రామ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ పుణ్యమా అని మళ్ళీ ఏ సినిమాలో నటించే ఛాన్స్ రాకపోవడం బాధాకరమని టాక్ వినిపిస్తోంది. ఇదే సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ రాజేష్ కి కూడా ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ రానేలేదు. రాహుల్ రవీంద్రన్ పలు తెలుగు,తమిళ చిత్రాల్లో చేసినా ప్రయోజనం లేకుండా పోవడంతో శ్రీమంతుడు మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. అయినా ప్రయోజనం దక్కిందేమీ లేదు. అయినా సరే ,ఇంకా కొందరు ఇలాంటి తప్పులని చేస్తున్నారని చెప్పాలి.