Movies

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఎక్కడ… ఏమి చేస్తుందో తెలుసా?

మాస్ మహారాజా రవితేజను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా ‘ఇడియట్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా కన్నడ బ్యూటీ రక్షిత హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ తరవాత ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. నిజానికి అప్పట్లో ఒక వెలుగు వెలిగారు రక్షిత. కెరీర్ మంచి రేంజ్‌లో దూసుకుపోతున్న సమయంలో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను వివాహం చేసుకున్నారు. 2007లో వీరి వివాహం జరిగింది.

పెళ్లి చేసుకున్న తరవాత రక్షిత మళ్లీ సినిమాల వైపు చూడలేదు. కానీ, పలు కన్నడ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే, అప్పుడు ‘ఇడియట్’ సినిమాలో రక్షితను చూసినవాళ్లు ఇప్పుడు అకస్మాత్తుగా ఆ కన్నడ కస్తూరిని చూస్తే షాక్‌కు గురికాక తప్పదు. ఎందుకంటే, అస్సలు ఊహించని విధంగా మారిపోయారామె. హీరోయిన్‌గా ఉన్నప్పుడు మంచి స్ట్రక్చర్ మెయింటెయిన్ చేసిన రక్షిత.. ఇప్పుడు బాగా లావెక్కారు.

నిజానికి, అప్పట్లో హీరోయిన్‌లుగా ఒక వెలుగు వెలిగిన చాలా మంది ఇప్పుడు మళ్లీ అక్కలుగా, అత్తలుగా, అమ్మలుగా నటిస్తు్న్నారు. కానీ, తాను ఏ విధంగానూ మళ్లీ వెండితెరపై కనిపించనని ఇప్పటికే రక్షిత స్పష్టం చేశారు. బహుశా ఆ నిర్ణయం వల్లే ఆమె తన శరీరం బరువు పెరుగుతున్నా పట్టించుకోవడం మానేసి ఉంటారు. తాజాగా, రక్షిత ఫొటో ఒకటి బయటికి వచ్చింది. వాలంటైన్స్ డే రోజున జరిగిన ఒక ఈవెంట్‌లో తీసిన ఫొటోలా అనిపిస్తోంది. ఈ ఫొటోలో భర్త ప్రేమ్ నుంచి రక్షిత లవ్ బెలూన్‌ను అందుకుంటున్నారు. ఈ ఫొటోలో రక్షితను చూసిన తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోక మానరు. ఎందుకంటే అంత లావుగా ఉన్నారు రక్షిత.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."