ఆమెకథ లో రాజమాత రియల్ లైఫ్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరుగుతుంది ఆమె భర్త ఎవరో తెలుసా?

బుల్లితెరపై మాటీవీలో ప్రసారమయ్యే ఆమెకథ సీరియల్ లో ఆసక్తికరంగా నడుస్తోంది. కథ,కథనం ఆసక్తిగా ఉండడమే కాదు,అందులో నటీనటులు అద్భుతంగా క్యారెక్టర్స్ పండిస్తున్నారు. ఇక ఇందులో రాజమాత క్యారెక్టర్ రోజురోజుకీ మరింత ఆసక్తిగా మారుతోంది. ఈ పాత్ర బాగా పాపులర్ కావడంతో ఆమె రియల్ లైఫ్ గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. ఆమె గురించి ఆసక్తిగా సెర్చ్ చేస్తుంటే కొన్ని షాక్ తినే నిజాలు బయటపడ్డాయి. 1972డిసెంబర్ 22న గుడివాడ లో పుట్టిన ఈమె అసలు పేరు శిరీష సౌగంధి . రాజమాతగా,శ్యామలాదేవిగా తన నటనతో అదరగొట్టేస్తోంది.

విజయవాడ సిద్ధార్ధ స్కూల్,సిద్ధార్ధ కాలేజీలో చదువువుకున్న శిరీష శోభన్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ నీల్ కృష్ణను పెళ్ళాడింది. తెలుగు, తమిళం, మలయాళం,కన్నడం,హిందీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నటించింది. దాదాపు 75సినిమాల్లో చేసింది. మలయాళంలో మొట్టమొదటి సారిగా చేసిన రవళి మూవీ మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత జడ్జిమెంట్ మూవీతో అందరికీ తెల్సింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి,మంచు విష్ణు తదితరులతో నటించింది. అలవైకుంఠపురంలో కూడా నటించింది.

1990లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సపోర్టింగ్ కేరక్టర్స్ చేస్తూ వచ్చిన శిరీష చేసిన బాస్ సినిమా మంచి పేరుతెచ్చింది. శుభాకాంక్షలు, వినోదం,పెళ్ళిసందడి వంటి సినిమాల్లో శిరీష చేసినప్పటికీ ఎక్కువమంది గుర్తుపట్టింది సీరియల్స్ ద్వారానే అని చెప్పాలి. బుల్లితెర ఆమె లైఫ్ ని మార్చేసింది. కార్తీక దీపం,సావిత్రి వంటి సీరియల్స్ లో ఆమె నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. నమో వెంకటేశాయా,అత్తారింటికి దారేది,శశిరేఖా పరిణయం,స్వాతిచినుకులు వంటి సీరియల్స్ లో నటించిన ఈమె తమిళ సీరియల్స్ లో కూడా మంచి పేరుతెచ్చుకుంది.