మెగాస్టార్ తో “ఇంద్ర” టైంలో రేఖ వేదవ్యాస్..షాకింగ్ కామెంట్స్

మన తెలుగులో “ఆనందం” చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.అలాగే ఆ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన రేఖ వేదవ్యాస్ ను కూడా తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు.అయితే ఆమెను గత సోమవారం స్పెషల్ గెస్ట్ గా “ఆలీతో సరదాగా” ముఖ్య అతిధిగా తీసుకురాగా ఆమె ఈ షో ద్వారా చాలా ఆసక్తికర విషయాలను ఈటీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.

అయితే ఆలీ తనకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా మొదట షారూహ్ ఖానే అని చెప్పింది.ఆ తర్వాత తెలుగులోకి వచ్చినట్టయితే తాను మొట్ట మొదటిసారిగా తెలుగులో ఓ సినిమా చూసాను అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” చిత్రమే అని తెలిపారు.అయితే ఇక్కడే మెగాస్టార్ తో తనకు ఎదురైన ఒక మెమొరబుల్ ఘటన ఉందని తెలిపారు.

తాను అప్పుడు “ఒకటో నెంబర్ కుర్రాడు” అలాగే మెగాస్టార్ చిరు నటిస్తున్న “ఇంద్ర” సినిమాల షూటింగ్ లు స్విట్జర్ లాండ్ లో అనుకోకుండా పడ్డాయని కానీ ఆ సమయంలో తన ఫోన్ కి చార్జర్ అవసరం పడ్డప్పుడు ఆయనే స్వయంగా తన చార్జర్ తాలుకా అడాప్టర్ ను నాకు ఇచ్చారని అది చాలా ఏళ్ళు కూడా దాచుకున్నానని రేఖ తెలిపారు.ఆ టైం లో నాకు మెగాస్టార్ లాంటి వ్యక్తి తనకి సంబంధించిన వస్తువు ఇవ్వడం అంటే గ్రేటే కదా అన్న టైప్ లో తన ఆనందాన్ని ఈ షో ద్వారా తాను పంచుకున్నారు.