ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తిని మీరు గుర్తుపట్టారా?తెలుగులో పెద్ద స్టార్ సెలబ్రిటీ అని మీకు తెలుసా?
కొంతమంది హీరోలు తెరమీద,బయట కూడా ఒకేలా కనిపిస్తారు. మరికొందరైతే తెరమీద కన్నా బయట డిఫరెంట్ గా కనిపిస్తారు. పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వడం,మేకప్ వేసుకోవడం వంటి కారణాల వలన ఈ తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇలాంటి ఓ ఫోటో ఇప్పుడు షోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతోంది. ఇది ఎవరిదని విషయం ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు.
కానీ ఈ ఫోటో ఎప్పటిది,ఒకవేళ మేకప్ లేకపోతె ఇలానే ఉంటాడా అనే చర్చ నడుస్తోంది. అయితే ఇపుడు వైరల్ అయ్యే ఫోటో ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజుది. దిల్,ఆర్య,భద్ర,కొత్త బంగారు లోకం,మున్నా, పరుగు,జోష్,రామ రామ కృష్ణ కృష్ణ,వంటి హిట్స్ తీసాడు. ఇక శతమానం భవతి మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. సక్సెస్ ఫుల్ జర్నీ ఈయనది.
ఇక ఈయన 1990నాటి రోజుల్లో కొడైకెనాల్ లో భార్య ,కూతురితో కల్సి ముచ్చటగా తీసుకున్న ఫోటో ఇది. అప్పుడు ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లిన దిల్ రాజు తీసుకున్న ఈ ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సినీ డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ని అప్పుడే ప్రారంభించాడు. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ని పంపిణి చేసిన దిల్ రాజు ఆతరువాత నిర్మాతగా మారి హిట్ మూవీస్ తీస్తున్నాడు.

