Beauty Tips

మండే ఎండల నుండి చర్మాన్ని రక్షించుకోండిలా..!

ఇంకా ఎండాకాలం రానేలేదు అప్పుడే భానుడు తన ఎండ ప్రతాపాన్నిచూపించడం మొదలు పెట్టాడు. ఎండలో కాసేపు బయటకు వెళితే చాలు మన చర్మం నిర్జీవంగా మారుతుంది. ముఖం కందిపోయి కళ తప్పుతుంది. మరి ఇలాంటి సమస్యల నుంచి సత్వరం ఉపశమనం లభించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1) మన శరీరానికి చలువ చేసే అలోవెరా జెల్‌ని రోజూ చర్మానికి రాయడం వల్ల చర్మం ఎప్పుడూ పొడిబారకుండా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌ చర్మాన్ని చల్లబర్చడానికి, నల్లని మచ్చలను తొలిగించడానికి ఉపయోగపడుతాయి.

2) షియా బటర్‌లో అధిక సాంద్రత, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సున్నితంగా ఉంచుతాయి. దీంట్లో ఉండే నూనెలో చర్మంలోకి వేగంగా కలిసిపోయి, చర్మంలోని తేమను పునరుద్ధరిస్తాయి. బయట వాతావరణం నుంచి చర్మాన్ని ఈ బటర్‌ రక్షిస్తుందన్నమాట.

3) రాస్‌బెర్రీ విత్తనాల నుంచి వచ్చే నూనె జింక్‌ ఆక్సైడ్‌కు సమానమైన ఎస్‌పీఎఫ్‌ 20ని అందిస్తుంది. ఇందులో ఓమెగా 3, ఆరు కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి రక్షించే సామర్థ్యం ఈ రాస్‌బెర్రీ విత్తన నూనెల్లో అధికం. ఇందులో ఉండే విటమిన్‌ ఎ, ఈ ల వల్ల చర్మవ్యాధులు కూడా దరిచేరవు.

4) బాదం నూనె చర్మాన్ని యూవీ కిరణాల నుంచి దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే ఇప్పటివరకు చర్మం ఏదైనా డ్యామేజ్‌ అయితే కూడా ఇది రిపేర్‌ చేస్తుంది. వృద్ధాప్య చాయలు రాకుండా ఈ నూనె రక్షిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."