కొండవీటి దొంగ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ కి ఓ స్వర్ణయుగం. దాదాపు 350కి పైగా సినిమాలకు కథ, మాటలు అందించిన దిగ్గజాలు. తన అనుభవాన్ని, చేసిన పొరపాట్లను నేటి తరానికి చెప్పి, సినిమా రాణించాలనుకునే వారికి ఉచిత సలహాలు ఇస్తున్నారు. యూట్యూబ్ పరుచూరి పలుకులు అంటూ నాటి విశేషాలను వీడియో ద్వారా పోస్ట్ చేస్తుంటారు. తాజాగా కొండవీటి దొంగ సినిమా విశేషాలను పరుచూరి గోపాల కృష్ణ చెప్పారు.

‘కొండవీటి దొంగ కథను చిరు-శ్రీదేవి కోసమే రాశాము. కథ చిరంజీవికి, నిర్మాతకు కూడా బాగా నచ్చింది. అయితే హీరోయిన్ గా ఎవరని అనుకుంటున్నారు అని అడిగితే శ్రీదేవి అని చెప్పాము. సరే వెళ్లి అడగండి అని నిర్మాత అనుమతిచ్చారు. కథ విన్న శ్రీదేవి బాగుందని అన్నారు. టైటిల్ ను కొండవీటి రాణి-కొండవీటి దొంగ గా మార్చాలని, కథలో హీరోయిన్ కాకుండా హీరోనే తన వెంట పడేటట్లుగా కథ మారిస్తే చేస్తానని అన్నట్లు చెప్పుకొచ్చారు.

ఇదే విషయాన్నీ నిర్మాతకు చెబితే… కథ మార్చొద్దు, అయన స్టార్ హీరో…. హీరోయిన్ వెంట పడితే కథ చెడిపోతుంది, హీరోయిన్ ను మార్చేయమని చెప్పారు. అలా శ్రీదేవి కండిషన్స్ పెట్టడంతో కథ అంతా మారిపోయిందని తెలిపారు. ఆ కథలో అమ్మ పాత్రకు శారద, డాక్టర్ పాత్రలో రాధ, పోలీసాఫీసర్‌గా విజయశాంతి వచ్చి చేరార’ని అన్నారు.