Movies

ఈ విలన్ అన్న టాలీవుడ్ లో హీరో అని మీకు తెలుసా…?

టాలీవుడ్ లో స్వీటీ అనుష్క నటించినటువంటి అరుంధతి అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో అరుంధతి పెళ్లి కార్డులు పంచడానికి వెళుతూ అరుంధతి మహల్ లో చిక్కు కున్నటువంటి అరవింద్ తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తు ఉంటాడు.అయితే అరవింద్ దాదాపుగా తెలుగు, తమిళ్, కన్నడ, కూడా పలు చిత్రాల్లో నటించాడు.తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి తో ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఈ కార్యక్రమంలో భాగంగా తన సినీ జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.తాను తెలుగులో దాదాపుగా టాలీవుడ్ లో ఉన్నవంటి స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించానని చెప్పుకొచ్చాడు.అయితే తన అన్నయ్య ప్రస్తుతం సీరియల్లో నటిస్తున్నాడని, అతడు ఎవరో కాదని ఇంద్రనీల్ అని చెప్పుకొచ్చాడు.తాను సినిమాల్లోకి రాకముందు కర్నాటకలోని బెంగళూరులో ఉద్యోగం చేసే వాడినని కానీ తన తల్లిదండ్రులు అభీష్టం మేరకు సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు.

తాను మొట్టమొదట టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన టువంటి సూపర్ అనే చిత్రంలో చిన్న పాత్ర చేశానని తెలిపాడు.అలాగే టాలీవుడ్ లో కూడా అరుంధతి సినిమాలో మొదటగా సోనూసూద్ నటించినటువంటి విలన్ పాత్ర తనకే వచ్చిందని, కానీ ఏమైందో ఏమో కానీ షూటింగ్ మొదలయ్యే రోజుకి చిత్ర యూనిట్ సభ్యులు సోనూసూద్ ని ఎంపిక చేశారని చెప్పుకొచ్చాడు.

అయినా తనకు ఏమీ బాధ లేదని తనకి కావాల్సింది సినిమాలో పాత్ర అని అందువల్ల ఏ పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.ఒక నటుడికి దర్శక నిర్మాతలు తమ చిత్రంలో పాత్ర ఇవ్వాలంటే ఆ పాత్ర కి మనం సరిపోతమో లేదో అని ఆలోచిస్తారని, ఒకవేళ మనం వాళ్ళు అనుకున్నటువంటి పాత్రకి సరిపోతే వారే పిలిచి అవకాశాలు ఇస్తారని ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు.తాను కూడా ఇదే నమ్ముతానని తెలిపాడు.