Movies

మెగాస్టార్ విషయంలో మురళీ మోహన్ చెప్పిందే నిజమైందా… ఏమి చెప్పారు

టాలీవుడ్ లో మురళీమోహన్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, ఒక నిర్మాతగా ఒక బిసినెస్ మ్యాన్ గా.. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యునిగా రూపాంతరం చెందాడు. యాక్టర్ నుండి ప్రజల సేవకుడిగా మారిపోయాడు. ఎన్నో వందల సినిమాలు చేసి కుటుంబకథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగానే దగ్గరయ్యాడు. హీరోగా కృష్ణంరాజు, కృష్ణలతో పాటు స్టార్ హోదాను కూడా పొందాడు.

మొదటిసారి అన్నగారు ఎన్టీఆర్ ని చూసినప్పుడే కాళ్ళమీద పడిపోయానని ఆయనంటే అంత గౌరవం ఉందని ఇటీవల ఓ ఇంటర్యూలో మురళీమోహన్ చెప్పాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లోనే కృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని ఇక సినిమాల్లోకి వచ్చాక లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పొందాడని తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ.. చిరంజీవిని మొదటిసారి మనవూరి పాండవులు సినిమా టైంలో చూసినట్లు తెలిపాడు.

ఆ సమయంలో కృషంరాజు నేను మాట్లాడుకుంటున్నప్పుడు చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చిందట. అప్పుడు కృష్ణంరాజు “ఈ అబ్బాయివి కళ్ళు బాగున్నాయి. కళ్ళతోనే హావభావాలు బాగా పలికిస్తున్నాడు. విలన్ గా పెద్ద ఫ్యూచర్ ఉందని అన్నాడట. ఇంతలో మురళీమోహన్ జోక్యం చేసుకుని “ఆ అబ్బాయి పెద్ద విలనే కాదు తెలుగు ఇండస్ట్రీకే పెద్ద మొగుడవవుతాడు” అన్నాడట. మరి మురళీమోహన్ నోటి చాలవా ఏమిటో కానీ, అదే నిజమైంది. చిరంజీవి మెగాస్టార్ గా తనముందే ఎదిగిన తీరును చూసి ఆనందంగా ఉండాలి మురళీమోహన్ నవ్వుతూ అన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."