క్వారంటైన్ సమయంలో పూరి ఏమి చేస్తున్నాడో చూస్తే వావ్ అంటారు

మన టాలీవుడ్ లో మాస్ అండ్ ఫాస్టెస్ట్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. తన స్పీడ్ మరియు మాస్ నెస్ ను అందుకోవడం మరో దర్శకునికి కష్టమే అని చెప్పాలి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా మన దేశంలో అన్ని రంగాలు స్తంభిచిపోయిన వేళ పూరి తన వంతుగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదొక సందేశం ఇస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ క్వారంటైన్ వేళను మన ఇతర దర్శకులు ఎలా వినియోగించుకుంటున్నారో ఏమో కానీ పూరి మాత్రం బాగానే వాడేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న పూరి ఈ క్వారంటైన్ లో ఖాళీగా ఉండకుండా సరికొత్త స్క్రిప్ట్ ను రాసేసుకుంటున్నారట. ఈ విషయాన్నే పూరి తన ఫాలోవర్స్ కు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఏమైనా పూరి రూటు కాస్త వెరైటీ గానే ఉంటుందని చెప్పాలి.