ఈ హీరో ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

క్రియేటివ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక విచిత్రం’ సినిమాతో రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ లో సక్సెస్ అయ్యాడే గానీ, తెలుగులో హీరోగా సక్సెస్ కాలేదు. అందుకే ఈ తెలుగు అబ్బాయి చాలా గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘సరైనోడు’ మూవీలో విలన్ గా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా విలన్ గా తలపడ్డాడు.

ఆ తర్వాత నానితో ‘నిన్నుకోరి’ సినిమా.. సోదరుడి దర్శకత్వంలో ‘మలుపు’ సినిమాలలో నటించాడు. తాజాగా ‘నీవెవరో’ – ‘యూ టర్న్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అంతేకాకుండా రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీ లో ‘అన్న’గా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

‘రంగస్థలం’ సినిమా తరువాత హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టికి తెలుగులో తిరుగుండదని అందరూ భావించారు. ఈ సినిమాలో ఆది నటన ఆ రేంజ్ లో ఉంది. ఈ సినిమా ఇచ్చిన ఊపులో సమంతతో కలిసి ఒక సినిమా, ‘క్లాప్’ అనే మరో ద్విభాషా సినిమా స్టార్ట్ చేసేసాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచిందనే విధంగా ఇతడి పరిస్థితి తయారైంది. అపుడెప్పుడో సమంత కాంబోలో ఆది ఓ సినిమా స్టార్ట్ చేసినా, మళ్లీ దానీ ఊసే లేదు.. ‘క్లాప్’ సినిమా క్లాప్ కొట్టిన తర్వాత ఎక్కడికో వెళ్లిపోయింది.

పోనీ విలన్ గా మనోడికి ఆఫర్స్ ఇద్దామన్నా మనోడు నెగిటివ్ షేడ్స్ చేసిన సినిమాలు డిజాస్టర్లు ఫ్లాపులే. ఇదంతా చూసుకుంటే ఆది పినిశెట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు ఇప్పుడైతే కనిపించడం లేదని ఇండస్ట్రీలో టాక్. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువు పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరో పరిస్థితి అటు తమిళంలో ఇటు తెలుగులోనూ మనోడికి కొత్త ఆఫర్స్ రాకుండా పోయాయి. ఇప్పుడైనా ఇతడి సీన్ మారుతుందేమో చూడాలి.