Movies

ఇంకా డైలమాలోనే ఉన్న “ఆచార్య” టీం.?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో చాలా రోజుల నుంచి ఒక గందరగోళ వాతావరణం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కు సంబంధించి అనేక రకాల వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతునే ఉన్నాయి. అదే విధంగా ఈ సినిమాలోని కాస్టింగ్ కు వస్తే ఒక్క మెగాస్టార్ చిరంజీవి తప్ప ఇంక మరెవరూ లేరా అనిపిస్తుంది.

ఎందుకంటే రీసెంట్ గానే ఈ సినిమా హీరోయిన్ త్రిష కొన్ని అనుకోని కారణాల చేత బయటకు వెళ్ళిపోయింది. దీనితో ఆ ప్లేస్ లో కాజల్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే కాజల్ పేరు కూడా ఇప్పుడు పరిగణలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. అలాగే రామ్ చరణ్ ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడో కూడా ఎవరికీ తెలియదు. దానికి తోడు ఇంకా హీరోయిన్ ఎవరూ అన్నది కూడా ఇంకా ఫైనల్ కాలేదు అని కొరటాల తెలిపారు. దీనితో ఆచార్య చిత్ర యూనిట్ మరోసారి డైలమాలో పడింది అని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."