Devotional

తిరుమల ద్వారం మే లో అయినా తెరుచుకునేనా?

గతంలో ఎప్పుడు లేని విధంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులు రాకుండా క్లోజ్‌ చేయబడినది.దేవుడికి ప్రతి రోజు జరగాల్సిన నిత్య కైంఖర్యాలు జరుగుతున్నాయి.కాని భక్తులకు మాత్రం అనుమతి లేదు.ప్రత్యేక రోజుల్లో లక్షల్లో, సాదారణ రోజుల్లో వేలల్లో తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకుంటారు.కాని దాదాపు నెల రోజులుగా తిరుమల కొండలపై గోవింద నామాలు వినపడటమే లేదు.భక్తులు లేక మాఢ వీధులు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు వెల వెల బోతున్నాయి.

ఈనెల 20వ తారీకున కొన్నింటికి లాక్‌డౌన్‌ సడలింపు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి దర్శనం దక్కే అవకాశం ఉందని అంతా అంటున్నారు. కాని కొందరు ఏపీ అధికారుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మే లో కూడా తిరుపతి ద్వారం ఓపెన్‌ అయ్యేది కష్టమే అంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టే వరకు భారీ ఎత్తున జన సమూహాలకు ప్రభుత్వాలు అనుమతించక పోవచ్చు అంటున్నారు.అందుకే ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉండక పోవచ్చు అంటున్నారు.తిరుమల స్వామి వారి దర్శణం కోసం ఎదురు చూసే వారు మరికొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే.