రవితేజ,పూరి కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చాయి…ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ …?

ఫ్రెండ్షిప్ కి అర్ధం చెప్పేలా మాస్ మహారాజు రవితేజ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మనకు కనిపిస్తారు. 1996నుంచి మొదలైన వీరి స్నేహం ఒకరి ఎదుగుదలకు ఒకరు బాటలు వేసుకున్నారు. పూరి సినిమాలతో రవితేజ హీరోయిజం తెచ్చుకోగా, రవితేజ సినిమాలతోనే పూరి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. వీరి కలయికలో 5 సినిమాలు ఇప్పటిదాకా వచ్చాయి. ఇందులో మూడు హిట్ అవ్వగా, రెండు ప్లాప్ అయ్యాయి.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తో వీరిద్దరి జోడి స్టార్ట్ అయింది. 2001లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. 2002లో వచ్చిన ఇడియట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి కూడా రవితేజ సరిగ్గా సరిపోతాడని ఊహించి తీసిన సినిమా మంచి ఫలితం అందించింది. అప్పటి స్టార్ హీరోలకు ధీటుగా కలెక్షన్స్ సాధించింది. తరువాత అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ 2003లో వచ్చిన సూపర్ హిట్ అయింది.

కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిల్చిన ఈ మూవీ తో రవితేజ, పూరి రేంజ్ ని ఇంకా పెంచేసింది. ఇక ఇద్దరూ బిజీ అయిపోవడంతో 2008వరకూ ఇద్దరి కాంబినేషన రాలేదు. నేనింతే మూవీ2008లో వచ్చి ప్లాప్ అయింది. సినిమా లో రవి యాక్టింగ్ అదిరింది. మళ్ళీ 2012లో దేవుడు చేసిన మనుషులు మూవీ ఇద్దరి కాంబోలో వచ్చి ప్లాప్ అయింది. అయితే త్వరలోనే వీరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు టాక్.